మొబైల్ అప్లికేషన్ ప్లాట్‌ఫామ్‌ని విడుదల చేసిన బైదు

బైదు వైఐ గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఆధారం చేసుకొని రూపోందించడం జరిగింది. ఇక బైదు గురించి చర్చించుకుంటే చైనాలో సెర్చ్ ఇంజన్ గెయింట్స్ లో అతి పెద్దది మాత్రమే కాకుండా చైనా షేర్ మార్కెట్లో 80శాతం వాటాని సొంతం చేసుకుంది. వీటితో పాటు ఈ కామర్స్, ఆన్ లైన్ వీడియో, ఆన్ లైన్ ట్రావెల్ లాంటి వాటన్నింటిని అనుసంధానం చేయడం జరిగింది. చైనా ఇంటర్నెట్ సంస్దలు, టెల్కో గేర్ తయారీ దారులు ఎవరికి వారు సొంతంగా మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఒక్క చైనాలోనే మాత్రమే కాకుండా భారత్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో కూడా తమ ఉత్పత్తలను విక్రయిస్తున్నారు.
చైనాకు చెందిన అతి పెద్ద ఈఊ కామర్స్ సంస్ద ఆలీబాబా గ్రూప్ జులై నెలలో సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్లో క్లౌడ్ ఆధారిత అఫ్లికేషన్స్, ఇంటర్నెట్ సెర్చ్ కలిపి రూపోందించడం జరిగింది. వీటితో పాటు హువాయ్ టెక్నాలజీస్ ఆగస్టులో క్లౌడ్ కంప్యూటింగ్ స్మార్ట్ పోన్‌ని మార్కెట్లోకి విడుదల చేసింది.


Click it and Unblock the Notifications