చైనాలో ప్రారంభమైన 5జీ..?

అడ్వాన్సుడ్ టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అందుకు అనుగుణంగా సాంకేతికతను అభివృద్థి చేసుకునే చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచ టెలికం సెక్టార్‌లో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించిన చైనా తన పరిధిలోని 100 నగరాల్లో 5జీ ట్రెయిల్స్‌ను ప్రారంభించింది. ఈ టెస్ట్ వర్క్‌ను 2018 నాటికి పూర్తి చేసి, 2020 నాటికి పూర్తిస్థాయిలో 5జీ నెట్‌వర్క్‌ను కమర్షియల్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురావాలని చైనా భావిస్తోంది.

చైనాలో ప్రారంభమైన 5జీ..?

Read More : నోకియా నుంచి డబల్ ధమాకా, లైన్‌లో 4జీబి ర్యామ్ ఫోన్ కూడా

చైనా అభివృద్థి చేసిన 5జీ ఇంటర్నెట్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ నెట్ వర్క్ తో పోలిస్తే 20 రెట్ల వేగంగా స్పందించగలదట. చైనాలో 4జీ మొబైల్ ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వారి 530 మిలియన్లుగా ఉంది (2016 మొదటి క్వార్టర్ నాటికి). టెస్టింగ్ దశలో భాగంగా మల్టిపుల్ యాంటెనా సిస్టమ్స్ 5జీ ఇంటర్నెట్ ను యూజర్లకు అందించటం జరుగుతుందని హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెక్నాలజీ పరంగా మనకంటే ముందంజలో...

టెక్నాలజీ పరంగా మనకంటే ముందంజలో ఉన్న జపాన్, అమెరికా, చైనా వంటి దేశాలు 4జీ నెట్‌వర్క్‌కు కాలం చెల్లిందంటూ  5జీ నెట్‌వర్క్ పై ముమ్మర పరిశోధనలు మొదలుపెట్టేసాయి. 5జీ నెట్‌వర్క్ రూపకల్పన ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్నప్పటికి ఏదో ఒక రోజున కమర్షియల్‌గా అందుబాటులోకి రావటం తద్యం.

త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ

త్వరలో అందుబాటులోకి రానున్న 5జీ, మునుపెన్నడు ఆస్వాదించని సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను చేరువ చేస్తుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. 5జీ ఎంత స్పీడ్‌లో లభ్యమవుతుంది..?, ఎంత డేటాను ఖర్చు చేస్తుంది..? అనే ప్రశ్నలకు ప్రస్తుతానికి స్పష్టమైన జవాబులు లేవు.

విప్లవాత్మక మార్పులకు 5జీ నెట్‌వర్క్ దోహదం

కమ్యూనికేషన్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులకు 5జీ నెట్‌వర్క్ దోహదం కానుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పై 5జీ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది. 5జీ నెట్‌వర్క్ 3జీ, 4జీలతో పోలిస్తే ఖరీదైన నెట్‌వర్క్‌‌గా అవతరించనుంది.

అంత సలువైన విషయం ఏమి కాదు..

5జీ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం అంత సలువైన విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఖరీదైన టెక్నాలజీకి సంబంధించి పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలను కల్పించేందుకు లక్షల కోట్ల పెట్టుబడలతో పాటు ప్రభుత్వ సహకారంతో కూడిన పాలసీలు అవసరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

రానున్న ఐదు సంవత్సరాల్లో..

రానున్న ఐదు సంవత్సరాల్లో 5జీ టెక్నాలజీ పై కృషి చేసేందుకు దిగ్గజ టెలికామ్ ఆపరేటర్స్ అయిన చైనా మొబైల్, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, సాఫ్ట్ బ్యాంక్‌లు సంయుక్తంగా GTI 2.0 పేరుతో ఓ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసాయి. తాజాగా రిలయన్స్ జియో కూడా 5జీ నెట్ వర్క్ పై దృష్టిసారించింది.

అధికారిక డెఫినిషన్ ఏమి లేదు..

5జీ నెట్‌వర్క్ గురించి ఇప్పటికి వరకు ఏ విధమైన అధికారిక డెఫినిషన్ వెలుగులోకి రాలేదు. అయితే, 5జీ అనేది 4జీ నెట్‌వర్క్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా వస్తోన్న వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ అని ధృడంగా చెప్పొచ్చు.

4జీతో 5జీని పోల్చి చూస్తే..

4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లో 4జీ ఎల్టీఈ (లాంగ్ టర్మ్ ఇవల్యూషన్) అనేది బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్. ఈ బేసిక్ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 100 Mbit/sగాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 4జీ టెక్నాలజీలో ఎల్టీఈ-ఏ అనేది అడ్వాన్సుడ్ వర్షన్‌గా ఉంది. ఈ కమ్యూనికేషన్ స్టాండర్డ్‌లో స్పందించే 4జీ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ అప్‌లోడ్ వేగం గరిష్టంగా 500 Mbit/s గాను, డౌన్‌లోడ్ వేగం 1Gbit/sగాను ఉంటుంది. 2020లో రాబోతోన్న 5జీ టెక్నాలజీ డేటా స్పీడ్‌కు సంబంధించి ఏ విధమైన వివరాలు వెల్లడికాలేదు.

2020 నాటికి 5జీ నెట్‌వర్క్‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హువావే 2020 నాటికి 5జీ నెట్‌వర్క్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది. 

ఎన్‌ఐటి డొకోమో ఇంక్‌..

ఎన్‌ఐటి డొకోమో ఇంక్‌, టోక్యోలోని రొపోంగి హిల్స్‌ కాంప్లెక్సుల్లో తాము 2015 అక్టోబర్‌ 13న అత్యధిక వేగంతో డేటా ట్రాన్స్‌మిషన్‌ చేశామని, అది దాదాపు 2 జీబీపీఎస్‌ వేగాన్ని అందుకుందని చెబుతోంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే 5జీ నెట్‌వర్క్ 1000 రెట్లు వేగంగా పనిచేసే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
China begins 5G trials in 100 cities. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot