ఆ విమానాల గుట్టు చైనా చేతిలో...

By Hazarath
|

పౌర విమానాలు,నౌకలను ట్రాకింగ్ చేసేందుకు ఉపయోగపడే మూడు క్యూబ్ శాటిలైట్లు చైనా విజయవంతంగా ప్రయోగించింది.ఆచూకి లేకుండా పోయిన ఎమ్ హెచ్ 370 విమానం లాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా చూడటానికి వీటి ద్వారా వీలవుతుందని భావిస్తోంది. ఎస్‌టీయూ -2గా పిలుస్తున్న ఈ క్యూబ్ శాట్స్‌ను సెప్టెంబర్ 25న ప్రయోగించగా అవి నిర్ధేశిత కక్ష్యలోకి విజయవంతంగా చేరాయని మిషన్ చీఫ్ డిజైనర్ యూ షుషాన్ తెలిపారు.కేవలం 6.8 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాల్లో ధ్రువ ప్రాంతాల పరిశీలన, కెమెరాలు, ఆటోమేటిక్ డిపెండంట్ సర్వైవలైన్స్ బ్రాడ్ కాస్ట్ రిసీవర్లను అమర్చారు.వీటి సాయంతో ఆచూకి లేకుండా పోయిన విమానాలను పసిగట్టే అవకాశం ఉందని చైనా ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ దశలో మిస్సయిన విమానాల తీరును ఓ సారి గుర్తుచేసుకుందాం.

Read more:రష్యా ‘ఉగ్ర'పంజా..మిస్సైల్స్‌తో ముప్పేట దాడి

2014సం. ముగియనున్న సమయంలో

2014సం. ముగియనున్న సమయంలో

రెండు రోజుల్లో ఈ 2014సం. ముగియనున్న సమయంలో ఘోర విమాన దుర్ఘటన జరిగింది. మొత్తం 162 మంది ప్రయాణికులు సిబ్బందితో కూడిన ఇండోనేషియాకు చెందిన నెంబర్: 8501 ఎయిర్ ఏషియా విమానం ఇండోనేషియాలో సురబయ విమానాశ్రయం నుండి సింగపూరు బయలుదేరిన ఈ విమానం 45 నిమిషాలు ప్రయాణం చేసిన తరువాత జావా సముద్రంపై పయనిస్తున్న సమయంలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్స్ తో సంబంధాలు తెగిపోయాయి.

సముద్ర అంతర్భాగంలో గాలించేంత టెక్నాలజీ ఇండోనేషియాకు లేదు

సముద్ర అంతర్భాగంలో గాలించేంత టెక్నాలజీ ఇండోనేషియాకు లేదు

సలవేసి ప్రావిన్స్‌లోని పర్వతప్రాంతంలో విమానం కూలిపోయినట్లు ఆ విమానం జాడకనిపెట్టేందకు వెళ్ళిన బృందం వెల్లడించింది. విమానంలో పయనిస్తున్న వారిలో 149మంది ఇండోనేషియా దేశానికి చెందినవారే ఉన్నారు.సముద్ర అంతర్భాగంలో గాలించేంత టెక్నాలజీ ఇండోనేషియాకు లేదు. విమాన అన్వేషణకు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, బ్రిటన్ తదితర దేశాలు పాలుపంచుకొన్నాయి.

ఎంహెచ్‌ 370 ఎంహెచ్‌
 

ఎంహెచ్‌ 370 ఎంహెచ్‌

మలేసియా ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ ఏషియా కు చెందిన ఎంహెచ్‌ 370 ఎంహెచ్‌ 17 క్యూజెడ్‌ 8501..మార్చి 8, 2014, జూలై 17, 2014 డిసెంబర్‌ 28,2014న కౌలాలంపూర్‌-బీజింగ్‌ ఆమ్‌స్టర్‌డామ్‌ నుంచి కౌలాలంపూర్‌ సురబాయా-సింగపూర్‌ కు బయలు వెళుతుండగా గల్లంతైంది. రష్యా సరిహద్దుల్లో జావా సముద్రంపై కూల్చివేశారనే అనుమానాలు వస్తున్నాయి. ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు ఎవరు కూల్చారో తెలియదు ఏమైందో తెలియడంలేదు

 త్రిగణ ఎయిర్‌ ఏటీఆర్‌ 42

త్రిగణ ఎయిర్‌ ఏటీఆర్‌ 42

పుపువా రాజధాని జయపురి విమానాశ్రయం నుంచి త్రిగణ ఎయిర్‌ ఏటీఆర్‌ 42 అనే ఇండోనేషియా విమానం 54 మంది ప్రయాణికులతో ఒక్సిబిల్‌ వెళ్తోంది. ఆ విమానం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌తో సంబంధాలను కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పపువా ప్రావిన్స్ లోని ఓస్కిబిల్ ప్రాంతంలో అడవులు, కొండలతో కూడిన మారుమూల ప్రాంతంలో ఇది కుప్పకూలింది.

విమానంలో భారీగా కరెన్సీనోట్ల కట్టలు

విమానంలో భారీగా కరెన్సీనోట్ల కట్టలు

అయితే ఈ విమానంలో భారీగా కరెన్సీనోట్ల కట్టలు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. $470,000 (భారత కరెన్సీలో దాదాపు 6.5 బిలియన్ రూపాయలు) నాలుగు సంచులలో తరలించినట్లు అనుమానాలు వచ్చాయి.విమానాన్ని పంపారు. వాతావరణం సరిగా లేకపోవడంతో ఫలితం లేకపోయింది.

అవియా స్టార్‌

అవియా స్టార్‌

ఇండోనేషియాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్యాసింజర్‌ విమానం గల్లంతైంది. అవియా స్టార్‌ అనే విమానయాన సంస్థకు చెందిన ట్విన్‌ ఒట్టర్‌ విమానం మసంబా నుంచి మకస్సార్‌కు బయలుదేరింది. అరగంటలో మకస్సార్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందనగా సులావేసి ప్రాంతంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. రెండు రోజుల తర్వాత కూలిపోయిన జాడ తెలిసింది.

లయన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం

లయన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం

బాలిలోని అంతర్జాతీయ విమాశ్రాయంలో దిగబోతు ఓ దేశీయ విమానం పక్కనే ఉన్న సముద్రంలోకి జారిపోయింది. లయన్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానం బాలి విమానాశ్రయం రన్‌వేపై దిగబోతూ పక్కనే ఉన్న సముద్రంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో విమానం 50 మీటర్ల ఎత్తులో ఉన్నట్లు సమాచారం. లైఫ్‌ జాకెట్ల సాయంతో నీటిపై తేలియాడుతున్న ప్రయాణికులను లయన్‌ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది, ప్రభుత్వ సహాయక విభాగం సిబ్బంది రక్షించి సమీపంలోని ఆస్పత్రలకు తరలించారు.

పోఖరా ఆల్ట్రాలైట్ కంపెనీకి చెందిన విమానం

పోఖరా ఆల్ట్రాలైట్ కంపెనీకి చెందిన విమానం

నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ తెలియకుండా పోయింది. ఇద్దరు విదేశీ పర్యాటకులతో పోఖరా నుంచి బయలుదేరిన తేలికపాటి విమానం నేపాల్‌లోని మంచు పర్వతాల్లో చిక్కుకుంది. పర్యాటక ప్రదేశాలను చూపించేందుకు బయలుదేరిన పోఖరా ఆల్ట్రాలైట్ కంపెనీకి చెందిన విమానం గంట తర్వాత మచ్చపుచ్చరే పర్వతప్రాంతం సమీపంలో గల్లంతైనట్లు పోలీసు అధికారి తెలిపారు.

వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ రవాణా విమానం

వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ రవాణా విమానం

వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన ఓ రవాణా విమానం అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పర్వతశ్రేణుల్లో అదృశ్యమైంది.ఏఎన్- 32 విమానం అసోంలోని దిబ్రూగఢ్ నుంచి అరుణాచల్‌లోని మెచుకాకు వెళ్లింది. అనంతరం అక్కడ మధ్యాహ్నం 2 గంటల సమయంలో జోర్హాత్‌కు ఆరుగురు పౌరులను తీసుకొని బయలుదేరిన ఈ విమానం జాడ తెలియకుండా పోయిందని వైమానిక దళ ప్రతినిధి వింగ్ కమాండర్ పి.సాహు తెలిపారు.

మొజాంబిక్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం

మొజాంబిక్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం

మొజాంబిక్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం అదృశ్యమైంది. విమానం మొజాంబిక్ నుంచి అంగోలా వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విమానం మోపాటలో టేకాఫ్ అయింది. సాయంత్రం 6.40 గంటలకు అంగోలా రాజధాని లువాండ చేరుకోవాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఆ విమానం అదృశ్యమైంది. ఈ విమానం జాడ కూలిపోయిన రెండు రోజుల తర్వాత తెలిసింది.

ఏఎఫ్447 విమానం

ఏఎఫ్447 విమానం

బ్రెజిల్ రాజధాని రియో డిజనెరియో నుంచి పారిస్ బయలుదేరిన విమానం ఆచూకీ గల్లంతైంది. అట్లాంటిక్ మహాసముద్రంపై ప్రయాణిస్తుండగా ఈ విమానం అదృశ్యమైంది. మొత్తం 228 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏఎఫ్447 విమానం అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయి ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఎయిర్ ఫ్రాన్స్ (ఏఎఫ్) విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.

బర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కి బయలుదేరిన ఎయిర్ అల్జీరీ విమానం

బర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కి బయలుదేరిన ఎయిర్ అల్జీరీ విమానం

అల్జీరియాకు చెందిన ఒక విమానం 110 మంది ప్రయాణికులతో అదృశ్యమైంది. బర్కినా ఫాసో నుంచి అల్జీర్స్‌కి బయలుదేరిన ఎయిర్ అల్జీరీ విమానం గంట తర్వాత జాడ లేకుండా పోయిందని ఎయిర్‌లైన్ పేర్కొన్నట్లు ఎపిఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. పశ్చిమ ఆఫ్రికాపై ప్రయాణిస్తున్న సమయంలో విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు ఎయిర్‌లైన్ తెలిపింది.

విమానాల జాడను పసిగట్టేందుకు

విమానాల జాడను పసిగట్టేందుకు

ఇలా కనపడకుండా పోయిన విమానాల జాడను పసిగట్టేందుకు చైనా క్యూబ్ శాట్స్ ను రెడీ చేసింది. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu

 

 

Best Mobiles in India

English summary
Here Write China launches CubeSats satellites for tracking aircraft

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X