ఆపిల్ ఐఫోన్ గ్యాస్ స్టవ్స్ చైనాలో.. ఆపిల్‌ని అపహాస్యం చేసేందుకేనా..?

Posted By: Prashanth

ఆపిల్ ఐఫోన్ గ్యాస్ స్టవ్స్ చైనాలో.. ఆపిల్‌ని అపహాస్యం చేసేందుకేనా..?

 

చైనాలో ఉన్న గ్యాస్ స్టవ్‌లపై ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ఐఫోన్ లోగో ఉండబోతుందా.. అంటే అవుననే అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇక వివరాల్లోకి వెళితే చైనాకు చెందిన ఓ ప్రముఖ కంపెనీ తాను రూపొందించిన సుమారు 700వందల గ్యాస్ స్టవ్‌లపై ఆపిల్ ఐఫోన్ లోగోని ప్రచురించింది. పైనున్న చిత్రంలో గనుక మీరు గమనించినట్లైతే ఆపిల్ ఐఫోన్ లోగోని క్లియర్‌గా చూడోచ్చు.

ఐఫోన్ అనే పదాలను కూడా క్లియర్‌గా ఈ గ్యాస్ స్టవ్‌లను తయారు చేసిన కంపెనీ ప్రచురించింది. ఈ గ్యాస్ స్టవ్‌లపై ఆపిల్ ఐపోన్ లోగోని చూసిన ప్రతి ఒక్కరూ.. చైనాలో ఆపిల్ ఉత్పత్తులకు నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తారనే వాదనకు బలం చేకూరింది. గత సంవత్సరం ఆగష్టు సమయంలో చైనాలో ఉన్న మొత్తం నకిలీ ఆపిల్ స్టోర్‌లను బస్టెడ్ చేసిన విషయం తెలిసిందే.

ఆపిల్ ఐఫోన్ లోగో చైనాలో ఉన్న గ్యాస్ స్టవ్‌లపై ముద్రించి ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉత్తమ & విప్లవాత్మక మార్పులు తెచ్చిన మీద ఆపిల్ కంపెనీ ఉత్పత్తులపై కొన్ని చైనీస్ కావాలనే పరిహాసం చేస్తున్నాయని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు. ఐతే ఈ విషయంపై ఆపిల్ ఎల్ స్పందిస్తుందో తెలయాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot