చైనాలో యాపిల్, ఆండ్రాయిడ్ కంపెనీలకు చేదు వార్త

Posted By: Staff

చైనాలో యాపిల్, ఆండ్రాయిడ్ కంపెనీలకు చేదు వార్త

చైనా మొబైల్ వచ్చే సంవత్సరం నాటికి చైనా మొత్తం మీద తన సొంత 'మొబైల్ అప్లికేషన్ స్టోర్'ని ఏర్పాట్లు చేయనున్నట్లు చైనా దినపత్రిక చైనా డైలీ ఓ కధనంగా ప్రచురించింది. ఇలా చైనా మొబైల్, మొబైల్ స్టోర్‌ని ఏర్పాటు చేయడం వల్ల దేశంలో ఉన్న యాపిల్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ స్టోర్స్‌కి గట్టి పోటీనిస్తుందని ప్లాన్‌లో భాగంగా ఇలా చేయడం జరుగుతుందని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లేతే 620 మిలియన్ సబ్ స్క్రైబర్స్‌ని సొంతం చేసుకొని నెంబర్ వన్ ఆపరేటర్‌గా కొనసాగుతున్న చైనా మొబైల్ త్వరలో ప్రారంభించనున్న ఈ మొబైల్ మార్కెట్(http://mm.10086.cn/) ద్వారా చైనాలో ఉన్న ప్రతి ఒక్క మొబైల్ యూజర్‌కి ఈ నెట్ వర్క్‌ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకొవాల్సిన విషయం మరోకటి ఉంది. అదేంటంటే చైనా మొబైల్ ఇంగ్లీషు భాషను కూడా ప్రవేశపెట్టడం వల్ల వేరే దేశాల నుండి వచ్చిన యూజర్స్ కూడా చైనా మొబైల్ సర్వీస్‌ని ఉపయోగించుకొవచ్చు.

మొబైల్ మార్కెట్‌ని చైనా మొబైల్ 2009వ సంవత్సరంలో ప్రారంభించింది. ప్రస్తుతం ఈ చైనా మొబైల్ మార్కెట్లో 138 మిలియన్ రిజిస్టర్ యూజర్స్ ఉన్నారు. పోయిన నెలలో చూసినట్లేతే చైనా మొబైల్ స్టోర్ నుండి 590 మిలియన్ డౌన్ లోడ్స్ జరిగాయను చైనా మొబైల్ ప్రతినిధులు వెల్లడించారు. ఇలా చైనా మొబైల్ సడన్‌గా తన యొక్క మొబైల్ స్టోర్‌ని విస్తరించాలని నిర్ణయం తీసుకొవడంతో యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తయారీదారులకు మింగుడు పడడం లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot