చైనాలో గూగుల్, ఎమ్‌ఎస్ మ్యాప్స్‌ని ఆపడం లేదు

Posted By: Staff

చైనాలో గూగుల్, ఎమ్‌ఎస్ మ్యాప్స్‌ని ఆపడం లేదు

చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ దేశంలో మ్యాప్స్‌ని ఆపరేట్ చేసేందుకు గాను కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడంతోపాటు, స్టేట్ లైసెన్స్‌లను కూడా రూపోందించింది. ప్రస్తుతం దేశంలో ఏమేమి రిజస్ట్రర్ చేసుకోని వెబ్ సైట్స్ ఉన్నాయో అవన్ని జులై 1 నుండి వాటి యొక్క కొత్త లైసెన్స్‌ని తీసుకోవడం, అంతక ముందు లైసెన్స్ తీసుకున్న వెబ్ సైట్స్ కొత్త లైసెన్స్ తీసుకొవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ విషయంపై చైనా స్టేట్ బ్యూరో కంపెనీలు ప్రతిపాదించిన అప్లికేషన్స్ అన్నింటిని ఎగ్జామినేషన్ చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటివరకు గూగుల్, మైక్రోసాప్ట్ రెండు కంపెనీలకు మాత్రమే మ్యాప్స్‌ని ఆపరేట్ చేసే వెసులుబాటుని కల్పించడం జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం వల్ల ఏవైతే విదేశీ కంపెనీలు చైనాలో ఉన్నాయో అవన్ని కూడా మ్యాపింగ్‌కి సంబంధించిన డేటా మొత్తాన్ని చైనాలో లోకల్‌గా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇంత విధిగా ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టడానికి కారణం దేశానికి సంబంధించిన సమాచారం ఆన్ లైన్ మ్యాప్స్ ద్వారా బయటకు వెళుతుందనే ఉద్దేశ్యం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot