ప్రపంచానికి చైనా దిమ్మతిరిగే షాక్ , ఫస్ట్ క్యాష్‌లెస్ Airport !
మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం సాధించిన చైనా ఇప్పుడు విమానాశ్రయాల మీద పడింది.
డిజిటల్ రంగంలో చైనా ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ముందు వరసలో దూసుకుపోతోంది. టెక్నాలజీ రంగంలో తనకు తానే పోటీనంటూ మహా వేగంగా పరుగులు పెడుతోంది. మొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యం సాధించిన చైనా ఇప్పుడు విమానాశ్రయాల మీద పడింది. ఆ దేశంలో డిజిటల్ ఎయిర్‌పోర్టులను నిర్మిస్తోంది. చైనా క్యాష్‌లెస్ విమానాశ్రయంపై మీరు ఓ లుక్కేయండి.

ప్రపంచంలోనే తొలి క్యాష్‌లెస్ ఎయిర్‌పోర్టు
డిజిటల్ టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనా ప్రపంచంలోనే తొలి క్యాష్‌లెస్ ఎయిర్‌పోర్టును రెడీ చేస్తోంది. చైనాలోని హ్యాంగ్‌జౌ (Hangzhou) ఎయిర్‌పోర్టును సకల సదుపాయాలతో ప్రపంచంలోనే ఫస్ట్ డిజిటల్ ఎయిర్‌పోర్టుగా తయారుచేస్తోంది.

అన్ని రకాల సేవలకు డిజిటల్ పేమెంట్లే
ఈ హ్యాంగ్‌జౌ విమానశ్రయంలో అన్ని రకాల సేవలకు డిజిటల్ పేమెంట్లే అంగీకరిస్తారు. వసతి దగ్గర నుంచి టికెట్ల బుకింగ్, ట్రాన్స్‌ఫోర్ట్, పార్కింగ్, షాపింగ్, క్యాటరింగ్, హోటల్ బుకింగ్ దాకా డిజిటల్ పేమెంట్లే చేయాలి.

అత్యంత సెక్యూరిటీతో..
ఇక క్యాస్‌లెస్ గానే కాకుండా అత్యంత సెక్యూరిటీతో ఈ విమానశ్రయాన్ని తీర్చిదిద్దుతున్నారు. పూర్తిగా మానవరహితంగా మార్చేందుకు ఏర్పాటు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆర్టిఫీషియల్ సాయంతో
ఇంకా చెప్పాలంటే ఆర్టిఫీషియల్ సాయంతో అక్కడి పనులన్నీ చక్కబెడుతున్నారు. ఇమేజ్ రికాగ్నిషన్ టెక్నాలజీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతన్నాయి. అక్కడ విమానం కోసం ఎదురుచూసే ప్రయాణికులపై అడగడుగునా నిఘా ఉంటుంది.

ప్రయాణికులు వెయిట్ చేసే సమయం
ఈ క్యాస్‌లెస్ టెక్నాలజీ ద్వారా ప్రయాణికులు వెయిట్ చేసే సమయం తగ్గుతుందని ఈ సర్వీసు చాలా బావుందని దేశం big data and cashless services వైపు దూసుకెళ్లడం చాలా హ్యాపీగా ఉందని హ్యాంగ్‌జౌ దగ్గర నివసిస్తున్న వారు Global Timesకి తెలియజేశారు.

ఆలీబాబా పూర్తి సహాయ సహకారాలను..
ఇంతటి పటిష్టమైన విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసేందుకు చైనా ప్రభుత్వానికి ఆ దేశ టెక్ దిగ్గజం ఆలీబాబా పూర్తి సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ కామర్స్ రంగంలో ఇప్పటికే అక్కడ తిరుగులేని ఆధిపత్యంలో ఈ కంపెనీ దూసుకుపోతోంది.

చైనా సమాజాన్ని క్యాస్‌లెస్‌గా మార్చేందుకు
చైనా సమాజాన్ని క్యాస్‌లెస్‌గా మార్చేందుకు ఆలీబాబా కంపెనీ భారీగానే ఖర్చు చేస్తోంది. ఈ విమానశ్రయం కోసం దాదాపు CNY 3 billion బిలియన్లు ఖర్చు చేయనుందని సమాచారం. రానున్న రెండు సంవత్సరాల్లో చైనా పూర్తి క్యాస్‌లెస్ సమాజంగా మారుతుందని ఈ కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications








