విదేశీ మీడియాను తరిమికొడుతున్న చైనా

Written By:

చైనా విదేశీ మీడియాను బహిష్కరించింది. ఇకపై తమ అనుమతి లేకుండా ఎలాంటి వార్తలను ఇంటర్నెట్లో ప్రచురించరాదని ఆంక్షలు విధించింది. తమ దేశంలో ఏం జరిగినా అది పాజిటివ్ గానే రాయాలని అలా అయితేనే మా దేశంలో మీ వార్తలను అనుమతిస్తామని చెప్పింది. మాకు వ్యతిరేకంగా వార్తలు రాసే ఎటువంటి మీడియా అయినా సరే అది మా భూభాగం నుంచి తరిమేస్తామని ఘటానై హెచ్చరికలు చేసింది. ఇంకా ఏం చెప్పిందంటే..

Read more : ఆపిల్‌కు అమెరికా సెగ తగిలింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా

ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశీ మీడియా ఏదీ కూడా తమ భూభాగం నుంచి ఆన్‌లైన్‌లో ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయరాదంటూ చైనా ప్రకటించింది. ఈ కొత్త విధానం వచ్చే నెల మార్చి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.

ఎలాంటి మెటీరియల్‌ను ఆన్‌లైన్ విదేశీ మీడియా పబ్లిష్ చేయడానికి

పదాలు, వ్యాఖ్యలు, ఫొటోలు, మ్యాప్స్, గేమ్స్, యానిమేషన్, ఇలా సమాచారానికి సంబంధించిన ఎలాంటి మెటీరియల్‌ను ఆన్‌లైన్ విదేశీ మీడియా పబ్లిష్ చేయడానికి వీల్లేదంటూ చైనా పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.

ఒకవేళ ఏదైనా మెటీరియల్ పబ్లిష్ చేయాలనుకుంటే

ఒకవేళ ఏదైనా మెటీరియల్ పబ్లిష్ చేయాలనుకుంటే మాత్రం ప్రెస్, పబ్లికేషన్, రేడియో, ఫిల్మ్ అండ్ టెలివిజన్ విభాగం నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

సోషల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో

సోషల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఆంక్షలను మరింత కఠినం చేయడంలో భాగంగానే చైనా ఈ కొత్త నోటిఫికేషన్‌ను తీసుకొచ్చింది.

చైనా స్కెచ్ వేరుగా ఉన్నట్లు

చైనా, ఫారిన్ సంయుక్త వెంచర్లు, చైనా, ఫారిన్ సహకార వెంచర్లు, ఫారిన్ బిజినెస్ సంస్థలు ఆన్‌లైన్ పబ్లిషింగ్ సర్వీసులను నిర్వహించరాదు. అయితే చైనా స్కెచ్ వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది.

చైనా ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేసే

చైనా ప్రభుత్వ విధానాలకు లోబడి పనిచేసే విదేశీ మీడియా సంస్థలను మాత్రమే అనుమతించాలన్నది చైనా ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

ప్రస్తుతం చైనా కంపెనీతో కలిసి సంయుక్త వెంచర్లు

ప్రస్తుతం చైనా కంపెనీతో కలిసి సంయుక్త వెంచర్లు ప్రారంభించిన విదేశీ కంపెనీలకు మాత్రమే చైనా ఇంటర్నెట్ సర్వీసు ప్రొఫైడర్లు లెసైన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఆ అవకాశం ఉండదు.

ముందస్తు అనుమతి తీసుకోవాలంటే

ముందస్తు అనుమతి తీసుకోవాలంటే చైనా కమ్యూనిస్టు వ్యవస్థకు, చైనా ప్రభుత్వానికి, చైనా ప్రజా జీవన విధానానికి వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు రాయవద్దు లాంటి ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

సైబర్ స్పేస్‌ను నియంత్రించాల్సిందిగా ఇప్పటికే అనేక సార్లు చైనా ప్రభుత్వం

సోషల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ స్పేస్‌ను నియంత్రించాల్సిందిగా ఇప్పటికే అనేక సార్లు చైనా ప్రభుత్వం ప్రముఖ ఇంటర్నెట్ రెగ్యులేటర్‌ను హెచ్చరిస్తూ వచ్చింది. ఇప్పటికే ఇంటర్నెట్‌పై పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేసింది.

వాణిజ్య, వ్యక్తిగత ప్రయోజనాలు చైనా ప్రభుత్వానికి

వాణిజ్య, వ్యక్తిగత ప్రయోజనాలు చైనా ప్రభుత్వానికి ముఖ్యం కాదని, సామాజిక సుస్థిరత, జాతీయ భద్రతా ప్రయోజనాలే చైనా ప్రభుత్వానికి ముఖ్యమని సన్ యత్ సేన్ యూనివర్శిటీలో ‘స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డిజైన్' విభాగానికి డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఝాంగ్ జియాన్ వ్యాఖ్యానించారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write China set to ban all foreign media from publishing online
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot