చట్టవిరుద్దమైన 6,600 వెబ్‌సైట్లకు చెక్ పెట్టిన చైనా

Posted By: Super

చట్టవిరుద్దమైన 6,600 వెబ్‌సైట్లకు చెక్ పెట్టిన చైనా

జింగ్‌ : దేశవ్యాప్తంగా సుమారు 6,600 వెబ్‌సైట్లను ప్రభుత్వం మూయించివేసింది. ఈ వెబ్‌సైట్ల ద్వారా చట్టవిరుద్ధంగా వ్యాపార ప్రత్యర్థులపై వ్యతిరేక ప్రచారం చేయించడం జరుగుతోంది. ఈ వైబ్‌సైట్లు చట్టవ్యతిరేకంగా ఆన్‌లైన్‌లో ఉండే వార్తాకథనాలు డెలిట్‌ చేయడం..తమకు పడని వారిపై బురదజల్లేందుకు ఈ వెబ్‌సైట్లను వినియోగించు కుంటున్నాయని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ తెలిపింది. ఏప్రిల్‌ నెలలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. వాణిజ్య పరిశ్రమల శాఖ దేశవ్యాప్తంగా 150 కేసులను నమోదు చేసింది. ఆన్‌లైన్‌ ప్రచార ప్రకటనలు రోజు 1.76 లక్షల డాలర్ల వ్యాపారం జరుగుతోందని అధికార వర్గాలు తెలియజేశాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot