ఫిబ్రవరిలో చైనా టెలికామ్ ద్వారా 'ఐఫోన్ 4ఎస్'

Posted By: Prashanth

ఫిబ్రవరిలో చైనా టెలికామ్ ద్వారా 'ఐఫోన్ 4ఎస్'

 

చైనాలో అతిపెద్ద టెలికామ్ ఆపరేటరైనటువంటి 'చైనా టెలికామ్' ఫిబ్రవరిలో ఆపిల్ ప్రతిష్టాత్మక ఉత్పత్తి 'ఐఫోన్ 4ఎస్' ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. చైనా టెలికామ్ మొదటగా ఆపిల్‌తో భాగస్వామ్యం అయి.. ఐఫోన్ 4ఎస్ గురించిన పూర్తి సమాచారం తమయొక్క స్టాఫ్‌కి సెప్టెంబర్ నెల నుండి ట్రైనింగ్ ఇస్తుందని ఓ రూమర్ ఉంది. ఆ తరుణంలో ఐఫోన్ 4ఎస్‌కి సంబంధించిన విడుదల తేదీని చైనా టెలికామ్ ఖచ్చితంగా ప్రకటించ లేదు. చైనా డైలీకి ప్రచురించిన కధనం ప్రకారం చైనాలో చైనా టెలికామ్ ద్వారా ఐఫోన్ 4ఎస్‌ని ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నారని సమాచారం.

జనవరి మొదటి వారంలో ఐఫోన్ 4ఎస్‌కి సంబంధించిన నెట్ వర్క్ లైసెన్స్‌ని పొందినట్లు చైనా టెలికామ్ వెల్లడించింది. ఐతే చైనాలో ఉన్న మరో టెలికామ్ ఆపరేటర్ 'యునికామ్' మాత్రం ఐఫోన్ 4ఎస్ విడుదలైనప్పటి నుండి అమ్మకాలను మొదలుపెట్టింది. ఆపిల్ సానిల్టన్ దుకాణం వద్ద మొదటి రోజు అమ్మకాలు వివాదస్పదం, గందరగోళం మరియు హింస దృశ్యాలు సంభవించడంతో దేశవ్యాప్తంగా ఐఫోన్ 4ఎస్ అమ్మకాలు ఆఫ్‌గా పిలువబడే విధంగా ప్రేరేపించింది.

ఆ తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఆపరేటర్లు చైనా టెలికాం, చైనా మొబైల్ భాగస్వామ్యం నిర్ధారణ కుదిరింది. దీంతో ఆపిల్ ఆపరేటర్లతో భాగస్వామిగా వాగ్దానం తీసుకోని కొత్త టెలికాం నెట్‌వర్క్ పరీక్షని పూర్తి చేసి, దేశంలో ఆపిల్ ఐఫోన్ 4ఎస్ అమ్మకాలను ప్రారంభించనున్నారు. చైనా మొబైల్ ఇప్పటికే చైనాలో 10 మిలియన్ల ఐఫోన్ యూజర్స్‌ని కలిగి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot