మొబైల్ పేమెంట్ సర్వీస్‌ని ప్రారంభించిన చైనా టెలికమ్

Posted By: Staff

మొబైల్ పేమెంట్ సర్వీస్‌ని ప్రారంభించిన చైనా టెలికమ్

చైనా ప్రస్తుతం టెక్నాలజీని ఉపయోగించడంలో ముందుకి దూసుకువెళుతున్న దేశం. ఇటీవలే ప్రపంచంలో కెల్లా అతి పొడవైన సముద్ర మార్గాన హైవేని నిర్మించి రికార్డుని నమోదు చేసిన విషయం తెలిసిందే. అలాంది ఇప్పుడు చైనా ప్రభుత్వం తమ దేశ ప్రజలకు మరో అధ్బుత అవకాశాన్ని ప్రవేశపెట్టింది. చైనా టెలికామ్ తమ దేశంలో 3జి సర్వస్‌ని ఉపయోగిస్తున్న కస్టమర్స్ కోసం మొబైల్ పేమంట్ సర్వీస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీని ద్వారా దేశంలో 3జి సర్వీస్‌ని ఉపయోగిస్తున్న కస్టమర్స్ వారియొక్క మొబైల్ ఫోన్స్ ద్వారా డబ్బుని ట్రాన్స్‌ఫర్ చేయడంతోపాటు, అన్ని రకాలైన బిల్లులను కట్టడానికి మొబైల్ సర్వీస్‌ని ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.

ప్రస్తుతం ఈ సర్వీస్ బీజింగ్‌లో ఉన్న ప్రజలు ఎవరైతే తమయొక్క సిమ్ కార్డ్‌ని మొబైల్ పేమెంట్ కార్డ్ (యూజర్ ఐడెంటిటీ మోడల్) విధానానికి మార్చుకున్నారో వారికి మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ఇది చాలా స్పెషల్ సిమ్ కార్డ్ కావడం మాత్రమే కాకుండా చైనా టెలికామ్, చైనా యూనియన్ పే రెండు కలసి సంయుక్తంగా దీనిని రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న సర్వీస్‌కు ఎటువంటి విఘాతం కలగకుండా మీ యొక్క మొబైల్ పేమెంట్స్ జరిగే వీలుగా దీనిని రూపోందించడం జరిగిందని అన్నారు. అంతేగానీ దీనికోసం ఎటువంటి హార్డ్‌వేర్ అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.

ఈ యూజర్ ఐడెంటిటీ మోడల్‌తో కస్టమర్స్ వారియొక్క అన్ని రకాల బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్‌ని కొనసాగించవచ్చునని తెలియజేశారు. మొబైల్ పేమెంట్స్ విషయంలో చైనా ఓ పెద్ద హాట్ మార్కెట్. ఇందులో భాగంగానే ఆలీబాబా ఆన్ లైన్ పేమెంట్ ఫ్లాట్ ఫామ్‌ని మొబైల్‌కి అనుగుణంగా అప్లికేషన్‌ని అప్‌గ్రేడ్ చేయడమైంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot