ఫోన్ దొంగిలించి.. 11 పేజీల ఫోన్ నెంబర్లను ఇంటికి పంపిన దొంగ!!

Posted By:

ఫోన్ దొంగిలించి.. 11 పేజీల ఫోన్ నెంబర్లను ఇంటికి పంపిన దొంగ!!

చైనాకు చెందిన ఓ జేబు దొంగ యాపిల్ ఐఫోన్‌ను దొంగలించి సదరు ఫోన్‌లోని సిమ్ ఇంకా టెలిఫోన్ నెంబర్లను భద్రంగా కాగితం పై రాసి సదరు ఫోన్ యజమానికి పంపాడు. ఈ ఆశ్చర్యకర సంఘటనకు సంబంధించిన వివరాలను చైనాకు చెందిన ప్రముఖ పత్రిక ప్రచరించటం జరిగింది. వివరాల్లోకి వెళితే.... జౌ బిన్ అనే వ్యక్తికి సంబంధించిన యాపిల్ ఐఫోన్ షేరింగ్ టాక్సీలో అపహరణకు గురైంది. ప్రయాణ సమయంలో తన వెనుక కూర్చొన్న వ్యక్తి ఈ చోరికి పాల్పిడినట్లు బిన్ నిర్థారణకు వచ్చాడు.

చోరికి గురైన బిన్ ఫోన్‌లో దరిదాపు 1000 కాంటాక్ట్ నెంబర్లు ఉన్నాయి. తాను ఫోన్ పోగొట్టుకున్నందకు భాదపడలేదని ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను కోల్పొయినందుకు మనోవేదనకు గురయ్యానని బిన్ సదరు పత్రికకు తెలిపారు. చోరికి గురైన తన ఫోన్ పనిచేస్తుండటాన్ని గుర్తించిన బిన్ తన మొబైల్‌కు ఓ సందేశాన్ని పంపారు ‘నువ్వెవరో నాకు తెలుసు.. నువ్వు వెనుక సీట్లో కూర్చున్నావ్! నిన్ను వెదికి పట్టుకోగలనన్న నమ్మకం నాకుంది. ఒక సారి ఆ ఫోన్‌లోని కాంటక్ట్ నెంబర్ల జాబితాను చూడు, నీకే అర్థమవుతుంది.. నేను నిర్వహించే వ్యాపరమేంటో, అర్థం చేసుకుని నా ఫోన్‌ను ఈ చిరునామాకు పంపు అంటూ' ఆ సందేశంలో పేర్కొన్నారు.

బిన్ పంపించిన టెక్స్ట్ సందేశానికి స్పందించిన ఆ దొంగ ఫోన్‌లోని వెయ్యి టెలిఫోన్ నెంబర్ల వివరాలను పేర్లతో సహా 11 పేజీల పై రాసి, ఫోన్ సిమ్ కార్డ్‌ను జాగ్రత్తగా ప్యాక్ చేసి పార్సిల్ రూపంలో బిన్ సూచించిన చిరునామాకు పంపాడు. దీంతో ఆ జేబు దొంగ కాస్తా మంచి దొంగగా ప్రశంసలను అందుకుంటున్నాడు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot