Home
News

శాటిలైట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన చైనా

ఈ స్మార్ట్‌ఫోన్‌లకు టవర్ సిగ్నల్‌‌తో సంబంధం ఉండదు. కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పటికి ఈ స్మార్ట్‌ఫోన్‌తో మాట్లాడుకోవచ్చు.

By Sivanjaneyulu Bommu

శాటిలైట్ ఆధారంగా స్పందించే మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్‌ను చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్థి చేసింది. కొద్ది నెలల క్రితం చైనా కక్ష్యలోకి లాంచ్ అయిన Tiantong-1 అనే శాటిలైట్‌కు ఈ ఫోన్‌లు నేరుగా అనుసంధానమై ఉంటాయి. తియాన్‌తాంగ్ - 1 పేరుతో చైనా తన మొట్టమొదటి మొబైల్ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ఆగష్టు 6న కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

Read More : రూ.6,000 నుంచి రూ.12,000లోపు బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లు

 TT-1 స్మార్ట్‌ఫోన్‌

TT-1 స్మార్ట్‌ఫోన్‌

శాటిలైట్‌కు కనెక్ట్ అయి ఉండే ఈ TT-1 స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడ నుంచైనా మాట్లాడుకోవచ్చు. ఈ ఫోన్‌లను మరో రెండు మూడు నెలల్లో అమ్మకానికి ఉంచనున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఆదివారం ఓ కథనాన్ని ప్రచురించింది.

 ఐదేళ్ల కాలంలో మొబైల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్

ఐదేళ్ల కాలంలో మొబైల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్

వచ్చే ఐదేళ్ల కాలంలో మరిన్ని Tiantong-1 శాటిలైట్ లను లాంచ్ చేయనున్నట్లు చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ వెల్లడించింది.

ఎమర్జెన్సీ కమ్యూనికేషన్..

ఎమర్జెన్సీ కమ్యూనికేషన్..

ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ అవసరాల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లను డిజైన్ చేయటం జరిగింది. ప్రకృతి విపత్తులు సంభవించి గ్రౌండ్ టెలీకమ్యూనికేషన్ నెట్‌వర్క్ పూర్తిగా దెబ్బతిన్పపుడు ఈ శాటిలైట్ బేసిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రౌండ్ బేసిడ్ సెల్యులార్ నెట్‌వర్క్‌‌లను కూడా..

గ్రౌండ్ బేసిడ్ సెల్యులార్ నెట్‌వర్క్‌‌లను కూడా..

ఈ ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్‌లు శాటిలైట్ కవరేజ్‌నే కాకుండా గ్రౌండ్ బేసిడ్ సెల్యులార్ నెట్‌వర్క్‌‌లను కూడా సపోర్ట్ చేస్తాయట. 4జీ ఎల్టీఈ, 3జీ, ఎస్ంఎస్, వుయ్ చాట్, వీడియో, డేటా ట్రాన్స్ మిషన్ వంటి సదుపాయాలు ఈ ఫోన్ లలో ఉన్నట్లు తెలుస్తోంది. రిటైల్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.98767గా ఉండొచ్చని అంచనా.

చైనాదే అతిపెద్ద టెలీస్కోప్

చైనాదే అతిపెద్ద టెలీస్కోప్

అంతరిక్ష పరిశోధనలు, గ్రహాంతర వాసుల అన్వేషణ కోసం చైనా భారీ రేడియో టెలిస్కోప్ సిద్ధమైంది. ఈ టెలిస్కోప్ కు చివరి ప్యానల్ ను అమర్చడంతో దీని నిర్మాణం పూర్తయింది. చైనాలోని గుయ్ జౌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ భారీ టెలిస్కోప్ పరిమాణం 30 ఫుట్ బాల్ మైదానాలంత ఉంటుంది. విశ్వం ఆవిర్భావాన్ని మరింత మెరుగ్గా తెలుసుకోవడానికి, గ్రహాంతర వాసుల అన్వేషణకు ఈ టెలిస్కోప్‌ ద్వారా పరిశోధనలు చేపడతామని జెంగ్‌ తెలిపారు.

ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ..

ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ..

ఈ టెలీస్కోప్ విశ్వం నుంచి వెలువడే అర్థవంతమైన ధ్వనులు పసిగట్టగలదు. ఉక్కు స్తంభాలు, కేబుళ్ల సహాయంతో ఈ భారీ టెలీ స్కోప్‌ను నిర్మించటం జరిగింది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ప్యూర్టో రికోలోని అరెసిబో అబ్జర్వేరటరీ ప్రపంచపు అతిపెద్ద టెలీస్కోప్‌గా ఉంది. దీని వ్యాసం 300 మీటర్లు.

180 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో

180 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో

180 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు. గ్రహాంతర జీవులకు విద్యుత్‌ అయస్కాంత(ఎలక్ట్రో మేగెటిక్‌) ధ్వని తరంగాలను పంపించేందుకు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాట్లు చేశారు.

గ్రహంతరవాసుల అలికిడి..

గ్రహంతరవాసుల అలికిడి..

ఈ టెలిస్కోప్ ద్వారా అంతరిక్షంలో ఎక్కడ ఏ చిన్న శబ్దం అలికిడైనా తెలిసిపోతుంది. గ్రహంతరవాసులు అంతరిక్షంలో ఏ చిన్న శబ్దం చేసినా కాని అది చైనా లోని ఈ టెలిస్కోప్ కు చేరిపోతుంది.

 రేడియో తరంగాలను సైతం

రేడియో తరంగాలను సైతం

4,450 ప్యానెళ్లతో రూపొందించే ఈ టెలిస్కోపు రిఫ్లాక్టార్ వ్యాసం 500 మీటర్లు ఉంటుంది. ఒక్కొక్క ప్యానెల్ 11 మీటర్ల భుజపొడవుగల సమబాహు త్రిభుజ ఆకారంలో ఉంటుంది. విశ్వం నుంచి వెలువడే చిన్నచిన్న రేడియో తరంగాలను సైతం ఈ టెలిస్కోపు గుర్తించగలదని ఫాస్ట్ ప్రాజెక్ట్ చీఫ్ సైంటిస్ట్ నాన్ రెండాంగ్ తెలిపారు.

వేల కాంతి సంవత్సరాల దూరంలో..

వేల కాంతి సంవత్సరాల దూరంలో..

కొన్ని వందల, వేల కాంతి సంవత్సరాల దూరంలో మనలాంటి జీవ రాశి వున్నా లేదా తెలివైన జీవ రాశి వున్నా...అక్కడి నుంచి వచ్చే రేడియో సంకేతాలను పొందగలగటం కోసం ఇలాంటి భారీ రేడియో టెలిస్కోపులు ఉపయోగపడతాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
China unveils first smartphone for satellite communications network. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X