చైనా కంపెనీల నుంచి అనిల్ అంబానీకి భారీ షాక్

By Gizbot Bureau
|

వేల కోట్ల అప్పులు, దివాలా ఊబిలో కూరుకుపోయి అస్తులను అమ్ముకుంటున్న పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి చైనా కంపెనీల నుంచి మరో భారీ షాక్‌ తగిలింది. చైనాకు చెందిన పలు బ్యాంకులు ఆర్‌కాం బకాయిలకు సంబంధించి కనీసం 2.1 బిలియన్‌ డాలర్లు అప్పు కట్టాల్సిందేనని డిమాండ్‌ చేశాయి.

చైనా కంపెనీల నుంచి అనిల్ అంబానీకి భారీ షాక్

ఈ హఠాత్పరిణామంతో ఇప్పటికే భారీగా సంపదను కోల్పోయి ప్రపంచ బిలియనీర్ల జాబితాలోంచి కిందికి పడిపోయిన అనిల్‌ అంబానీ నెత్తిన మరో పిడుగు పడినట్టైంది. కాగా అన్న ముకేష్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ ను తీసుకోవాలనుకున్నా అది రెగ్యులేటరీ సమస్యల కారణంగా వెనక్కు వెళుతున్న సంగతి తెలిసిందే.

   అనిల్ అంబానీ కంపెనీకు పెద్ద మొత్తంలో రుణాలు

అనిల్ అంబానీ కంపెనీకు పెద్ద మొత్తంలో రుణాలు

చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనాలు అనిల్ అంబానీ కంపెనీకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చాయి అప్పులు ఇచ్చాయి. ప్రస్తుతం ఇవి అప్పులను రాబట్టేందుకు సిద్ధమయ్యాయి. జూన్‌ 13 నాటికి ఏడు టాప్‌ బ్యాంకులకు కంపెనీలు చెల్లించాల్సిన రుణాలు భారీ స్థాయిలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

చెల్లించాల్సిన రుణాల వివరాలు

చెల్లించాల్సిన రుణాల వివరాలు

చైనా ప్రభుత్వరంగ బ్యాంకు చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్.. రూ.9,860 కోట్ల (1.4 బిలియన్ డాలర్లు). ఎగ్జిమ్ బ్యాంక్ ఆప్ చైనా రూ.3,360 కోట్లు, కమర్షియల్ బ్యాంక్ ఆప్ చైనా రూ.1,554 కోట్లుగా ఉంది. దీనికితోడు దేశీయంగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ. 4910 కోట్లు, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ. 2 700 కోట్లు, యాక్సిస్‌ బ్యాంకు రూ. 2090 కోట్లు మాడిసన్‌ పసిఫిక్‌ ట్రస్ట్‌కు రూ.2350 కోట్లు బకాయి ఉంది. ఈ మొత్తం అప్పులు రూ.57,382 కోట్లుగా ఉంది. ఇది కాకుండా రష్యాకు చెందిన బీటీబీ కేపిటల్ ఆఫ్ రష్యాకు రూ.511 కోట్లు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ (లండన్), డాయిష్ బ్యాంక్ (హాంగ్‌కాంగ్) డీబీఎస్ బ్యాంక్, ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్‌లతో పాటు ఇతరులకు బకాయిలు పేరుకుపోయాయి.

రూ.17,300 కోట్ల కొనుగోలు ఒప్పందానికి బ్రేక్

రూ.17,300 కోట్ల కొనుగోలు ఒప్పందానికి బ్రేక్

ఈ రుణాలకు సంబంధించిన వివరాలను రిలయన్స్ కమ్యూనికేషన్స్ విడుదల చేసింది. కాగా ఆర్‌కామ్‌, ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని జియో మధ్య రూ.17,300 కోట్ల కొనుగోలు ఒప్పందానికి సిద్ధమయ్యాయి. కానీ రెగ్యులేటరీ సమస్యల కారణంగా ఈ డీల్‌కు బ్రేక్‌పడింది. ఇది ఇలా వుంటే ఆస్తులు అమ్మి అయినా మొత్తం అప్పులు తీర్చేస్తామని ఇటీవల అనిల్‌ అంబానీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

11 సంవత్సరాలలో కుప్పకూలిన అనిల్ అంబానీ సామ్రాజ్యం

11 సంవత్సరాలలో కుప్పకూలిన అనిల్ అంబానీ సామ్రాజ్యం

అప్పుల సంక్షోభం, టెలికాం సంస్థ ఆర్‌కాంతోపాటు ఇతర గ్రూపుసంస్థల వరుస నష్టాల నేపథ్యంలో అనిల్ అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది. 2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6 వ స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోయారు. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలింది. దీంతో ధనవంతుల జాబితా నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లారు.

 ప్రస్తుతం ఆస్తి విలువ రూ.3651 కోట్లు

ప్రస్తుతం ఆస్తి విలువ రూ.3651 కోట్లు

దశాబ్దకాలం గడిచిపోయేసరికి ఆయన ఆస్తి కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం అనిల్ అంబానీ మొత్తం ఆస్తి విలువ కేవలం రూ.3651 కోట్లు (523 మిలియన్ డాలర్లు) మాత్రమే. దీనికి ఆయన సారథ్యంలోని అనేక కంపెనీలు అప్పుల్లో కూరుకునిపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీని ఫలితంగా ఆయా కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. అప్పులు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ పాతాళానికి చేరిపోయింది.

 43 శాతం వాటాలను విక్రయించాలని..

43 శాతం వాటాలను విక్రయించాలని..

మ్యూచుఫల్‌ ఫండ్‌ జాయింట్‌ వెంచర్‌ అయిన, రిలయన్స్‌ - నిప్సాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌‌మెంట్‌‌లోని తమ 43 శాతం వాటాలను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించుకోవడం, గడచిన 14 నెలల కాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తీర్చడంతోనే అనిల్ అంబానీ ఆస్తి హారతికర్పూరమైందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రిలయన్స్ గ్రూప్ విలువ నాలుగు నెలల క్రితం రూ .8వేల కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఆయన మొత్తం సంపద 42 బిలియన్‌ డాలర్లనుంచి 0.5 బిలియన్‌ డార్లకు పడిపోయింది. 2018 ,మార్చి నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.

 ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు

ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు

ఇదిలా ఉంటే అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి వున్నామని అనిల్‌ అంబానీ ప్రకటించారు. 2018 ఏప్రిల్ మరియు మే 2019 మధ్య కాలంలో ఇప్పటికే వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయం, తనఖా ద్వారా ఈ అప్పులను తీర్చినట్టు తెలిపారు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి వున్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు. ఈ క్రమంలో రిలయన్స్‌ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Best Mobiles in India

English summary
Chinese banks demand $2.1 billion from Anil Ambani's RCom

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X