కుక్కకు 8 ఐఫోన్‌లు గిఫ్ట్‌గా ఇచ్చాడు
కూర్చుని తిన్నా తరగని సంపద. ఇంకే కావాలి చెప్పండి ఆ సిరి పుత్రుడికి. చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వాంగ్ జియన్ లిన్ కుమారుడు వాంగ్ సికాంగ్ తన పెంపుడు కుక్కకు ఖరీదైన 8 కొత్త iphone 7sలను బహుమతిగా ఇచ్చి ఎంతో మురిసిపోయాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికి ఇది వాస్తవం.
Read More : Google Allo..ఇది వాట్సాప్‌ను మించిన యాప్ అవుతుందా..?

తన పెంపుడు కుక్క ‘Coco'కు
చైనాకు చెందిన ప్రముఖ బిలియనర్లలో వాంగ్ జియాన్ లిన్ ఒకరు. ఇతని కుమారుడైన వాంగ్ సికాంగ్ తన పెంపుడు కుక్క అయిన ‘Coco'కు ఈ ఖరీదైన బహుమతిని ఇచ్చాడు.

ఆన్‌లైన్‌లో పెద్ద వైరల్‌గా మారి
చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ విబియో ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో పెద్ద వైరల్‌గా మారి సంచలనం రేపుతున్నాయి.

వీటి విలువ ఎంతంటే..?
ఇంతకీ బహుమతిగా ఇచ్చిన ఈ 8 ఐఫోన్ 7sల విలువెంతో తెలుసా..? చైనా కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 5,13,072/.

రెండు ఖరీదైన యాపిల్ వాచీలను కూడా
గతంలో వాంగ్ సికాంగ్ తన పెంపుడు కుక్కకు రెండు ఖరీదైన యాపిల్ వాచీలను బహుమతిగా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications








