స్మార్ట్‌ఫోన్ వాడే వారి కోసం ప్రత్యేకంగా రోడ్లు వేసేశారు
రోడ్డు మీద నడిచే సమయంలో స్మార్ట్‌ఫోన్ వాడితే ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చాలామంది ఆ వ్యసనాన్ని వదులుకోరు. రోడ్డు మీద ఏం వెళుతున్నా వారు ఫోన్లో లీనమయి పట్టించుకోరు. ఇలాంటి వారి కోసం ఏదైనా రోడ్డు ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. ఇలాంటి వారి కోసం చైనాలో కొన్ని చోట్ల రోడ్లను ఏర్పాటు చేశారు.స్మార్ట్ ఫోన్ లకు బానిసలైన వారి కోసం చైనాలోని రోడ్లపై ప్రత్యేకంగా లేన్లు కూడా వేశారు.

ఈ లేన్లపై స్మార్ట్ ఫోన్ యూజర్లు ఫోన్ వాడుకుంటూ నడవవచ్చు ఆ రోడ్డుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులేశారు. ఈ రోడ్డు ఫోన్ చూసుకుంటూ నడిచేవారికోసమే అని స్పష్టంగా తెలిసేలా స్మార్ట్ ఫోన్ బొమ్మలు కూడా గీశారు. ఈ దారిని చూసిన చాలామంది మెచ్చుకుంటుండగా మరి కొందరు మాత్రం సోషల్ మీడియాలో జోకుల మీద జోకులు పేలుస్తున్నారు.

ప్రమాదాలను నివారించేందుకు...
ఒక్కోసారి కొందరు ఫుట్‌పాత్‌పైనే వాహనాలు నిలుపుతుంటారు. ఫోన్లతో బిజీగా ఉంటూ చూసుకోకుండా వాహనాలను ఢీకొడుతుంటారు. ఇలాంటివన్నీ నివారించేందుకే నెల రోజులుగా ఓ కొత్త రోడ్డును ఏర్పాటు చేయమని కోరుతున్నామని, దానికి అధికారులు స్పందించి ఈ ఏర్పాటు చేశారని అక్కడి అధికారులు చెబుతున్నారు. 100 అడుగుల వరకు సెల్ ఫోన్ యూజర్ల కోసం దారిని ఏర్పరచారు. ప్రపంచంలో కెల్లా ఇదే ఫస్ట్ మొబైల్ వాకింగ్ రోడ్ అక్కడి అధికారులు చెబుతున్నారు.

చైనా షాంగ్జీ రాష్టంలో
చైనా షాంగ్జీ రాష్టంలోని వ్యాపార జిల్లాగా పేరున్న ఇన్ షియాన్ లోని ఓ షాపింగ్ సెంటర్ స్మార్ట్ ఫోన్ బానిసల కోసం ప్రత్యేకంగా ఓ లేన్ ను నిర్మించింది. స్మార్ ఫోన్ బానిసలకు మాత్రమే అంటూ వార్నింగ్ లు, సూచికలతో లేన్ నిర్మాణం చేశారు. ఒక మీటరు వెడల్పుతో వందల మీటర్లు ఈ లేన్ ఉంది. ఎదురుగా వచ్చే వాహనాలను ఈ లేన్ పక్కగా వెళ్లేందుకు డైరక్ట్ చేయడానికి సేఫ్టీ గార్డ్స్ ని నియమించారు.

స్మార్ట్ ఫోన్ బానిసలను పెంచుతున్నారంటూ ..
అయితే స్మార్ట్ ఫోన్ బానిసలను పెంచుతున్నారంటూ ఈ లేన్ నిర్మాణంపై సిటీ ప్రజల నుంచి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 2014లో కూడా చైనాలో మెదటిసారిగా చాంగ్ క్వింగ్ మున్సిపాలిటీలో మొబైల్ ఫోన్ సైడ్ వాక్ నిర్మాణం జరిగింది. ఈ సైడ్ వాక్ 3 మీటర్ల వెడల్పు, 50 మీటర్ల పొడవు ఉంటుంది. మెబైల్ ఫోన్ యూజ్ చేస్తూ సడుస్తున్న వారిని, యూజ్ చేయకుండా నడిచే వారిని ఈ సైడ్ వాక్ సపరేట్ చేస్తుంది.

యాక్సిండెట్లు ఎక్కువే
చైనా లెక్కల ప్రకారం జనవరి,2012 నుంచి జూన్,2017 వరకూ జరిగిన యాక్సిండెట్లలో 10.5 శాతం రోడ్డుపై నడుస్తూ, వెళ్లూ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్లే జరిగాయి. అయితే ఈ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకే ఈ లేన్ నిర్మాణం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు.

కాపీ కొట్టారని సెటైర్లు
Chongqing phone lane దారి కాపీ కొట్టారని ఇది వరకే Washington DCలోని 18th Streetలో ఈ రోడ్డు ఉందని మరికొందరు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే 2012లోనే Philadelphia నగరం e-lane పేరుతో smartphone users కోసం రోడ్డును ప్రకటించింది. అయిది అది ఏప్రిల్ పూల్ అంటూ ప్రకటించడంతో చాలామంది దానిపై దుమ్మెత్తిపోశారు. ఏదైమైనా స్మార్ట్ ఫోన్ యూజర్ల కోసం ఇలా ప్రత్యేకంగా రోడ్డు వేయడమనేది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే మరి.


Click it and Unblock the Notifications








