బైదు, మైక్రోసాప్ట్ కలయికతో గూగుల్‌కి ఇక చెమటలు పట్టిస్తాం...

Posted By: Staff

బైదు, మైక్రోసాప్ట్ కలయికతో గూగుల్‌కి ఇక చెమటలు పట్టిస్తాం...

చైనా సెర్చ్ ఇంజన్ బైదు, మైక్రోసాప్ట్ ఇద్దరూ వారియొక్క పాట్నర్ షిప్‌ని పెంపోదించుకోవాలనే ఉద్దేశ్యంతో మైక్రోసాప్ట్ సెర్చ్ ఇంజన్ అయినటువంటి బింగ్ ఇంగ్లీషు లాంగ్వేజ్ సెర్చ్ రిజల్ట్స్‌కు సంబంధించి క్వచ్చన్స్‌కి బైదు సెర్చ్ ఇంజన్ ఇంగ్లీషులో ఆన్సర్స్ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని మార్ బ్రిడ్జి కన్సల్టింగ్ ప్రకటించడం జరిగింది. బైదు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోయు సేన్ బ్లూమ్‌బర్గ్‌తో చెప్పిన దాని ప్రకారం ఈ రెండు కంపెనీలు కలవడం వల్ల ప్రపంచాన్ని ఏలడానికి సిద్దంగా ఉన్నాయని తెలస్తుంది.

ముఖ్యంగా చైనీస్ సెర్ట్ ఇంజన్ బైదు మైక్రోసాప్ట్‌తో కలవడానికి కారణం ఇతర దేశాలలో ఉన్నటువంటి గూగుల్‌కి గట్టి పోటీ ఇవ్వడమే. స్వతహాగా బీజింగ్‌కి సంబంధించినటువంటి కంపెనీ అవ్వడం వల్ల బైదు చైనాలో టాప్ స్దానానికి చేరడం మాత్రమే కాకుండా గూగుల్‌ని కూడా డామినేట్ చేయడం జరిగింది. సేన్ మాట్లాడుతూ బైదుని త్వరలో 12భాషలలో తయారు చేసి విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. అంతేకాకుండా త్వరలో బైదు గూగుల్‌ని పూర్తిగా నాశనం చేసి నెంబర్ స్దానానికి చేరడంలో తన దైన పాత్రని పోషిస్తుంది అనడంలో సందేహాం లేదు అని అన్నారు. అందుకోసమే మేము మైక్రోసాప్ట్‌తో సంబంధాలు మెరుగుపరచుకున్నాం.

చైనాలో బింగ్‌ని నిర్వహించడానికి మైక్రోసాప్ట్, షాంఘై ఎమ్‌ఎస్‌ఎన్ నెట్ వర్క్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ రెండు భాద్యత తీసుకోనున్నయని తెలిపారు. చైనాలో 75.8 మార్కెట్‌ని బైదు సోంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మైక్రోసాప్ట్ విషయానికి వస్తే 1శాతం కన్నా తక్కువ మార్కెట్ వాల్యూ కలిగి ఉంది. అంతేకాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 100 బ్రాండ్స్‌లో బైదుది 29వ స్దానం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot