బ్యాన్ చేసినా ఇండియాలో చైనాదే ఆధిపత్యం

Written By:

ఇండియాలో చైనా వస్తువులను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారతీయులు ఎంతగా ప్రచారం చేసినప్పటికీ ఇండియా మార్కెట్లో చైనానే ఆధిపత్యం చెలాయిస్తోంది. గతేడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా ఫోన్లు దాదాపు 40 శాతం వరకు అమ్ముడుపోయాయి. ప్రపంచంలోని రెండో అతి పెద్ద విపణిగా అవతరించిన భారత్‌లో ఇండియా బ్రాండ్లు సత్తా చాటలేకపోతున్నాయి.

భీమ్ యాప్‌‌లో డబ్బులు పంపడం, రిక్వెస్ట్ చేయడం ఎలా ..? ( స్టెప్ బై స్టెప్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ నంబర్ వన్

గతేడాది ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల ప్రభావం పడినప్పటికీ ఇండియాలో శాంసంగ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

రెండవ స్థానంలో లెనోవో

రెండవ స్థానంలో చైనాకు చెందిన లెనోవో నిలిచింది. ఈ కంపెనీ ఫోన్లు గతేడాది భారీగా అమ్మడుపోయాయి. ధర తక్కువగా ఉండటంతో పాటు ఫీచర్లు ఎక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు ఎక్కువగా దీనిమీద ఆసక్తి చూపినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) సర్వేలో తేలిందని చైనా అధికారిక పత్రిక వెల్లడించింది.

మూడవ స్థానంలో షియోమి

ఇక మూడవ స్థానంలో చైనా ఆపిల్ షియోమి నిలిచింది. ఈ కంపెనీ ఫోన్లు గతేడాది ఇండియాలో 10. 7 శాతం మేర అమ్ముడుపోయాయి. ప్రధానంగా రెడ్ మి నోట్ ఫోన్లు ఇండియాలో ఓ సునామినే సృష్టించాయి.

మైక్రోమ్యాక్స్ అమ్మకాలు

చైనా కంపెనీల దెబ్బతో ఇండియాలో భారత కంపెనీల జోరు పూర్తిగా తగ్గింది. గతేడాది మైక్రోమ్యాక్స్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దాదాపు ఒక్క అక్టోబర్ నెలలోనే 16.7 శాతం క్షీణించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.

చైనా ఫోన్ల అమ్మకాలు

ముందు ముందు చైనా ఫోన్ల అమ్మకాలు భారత్ లో భారీగా జరిగే అవకాశం ఉందని దీనికి కారణం తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను కొనేందుకు భారతీయులు ఆసక్తి చూపించడమేనని తెలుస్తోంది.ఈ సర్వేని 30 ప్రధాన నగరాల్లో నిర్వహించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Chinese smartphones gain 40 percent of Indian market last year: Survey Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting