ఐప్యాడ్ 2 కొనుక్కోవడం కోసం ఇంట్లో చెప్పకుండా కిడ్నీ అమ్మిన టీనేజర్

Posted By: Staff

ఐప్యాడ్ 2 కొనుక్కోవడం కోసం ఇంట్లో చెప్పకుండా కిడ్నీ అమ్మిన టీనేజర్

బీజింగ్: ఐప్యాడ్ 2 మీద ఉన్న మమకారం ఓ చిన్నారి కిడ్నీని బలి చేసింది. చైనాలోని అన్హూయి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఓ టీనేజర్ ఐప్యాడ్ 2 కొనుగోలు చేయడం కోసం తన కుడి కిడ్నీని అమ్మడం జరిగింది. పదహేడు సంవత్సరాలు వయసు కలిగినటువంటి 'జియా జింగ్' అనే టీనేజర్‌కి ఐప్యాడ్ 2 అంటే ప్రాణం. కానీ ఐప్యాడ్ 2 ధర మాత్రం తనకి అందనంత దూరంలో ఉండడంతో 'జియా జింగ్' తన కిడ్నీని అమ్మడం జరిగింది.

అసలు వివరాలలోకి వెళితే గురువారం డాన్‌ఫాంగ్ టివి ఛానల్ కధనం ప్రకారం 'జియా జింగ్' ఓ ఏజెంట్ దగ్గరకు వెళ్శి తన కిడ్నీని అమ్మడానికి సిద్దంగా ఉన్నానంటూ, సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రోవెన్స్ వద్దకు వెళ్శి అక్కడ ఉన్నటువంటి ఓ చిన్న లోకల్ హాస్పిటల్‌లో కిడ్నీ సర్జరీ చేయడం జరిగింది. కిడ్నీ సర్జరీకి గాను 'జియా జింగ్'‌కి ఆ ఏజెంట్ 22,000 yen ($3,900) ఇవ్వడం జరిగింది. అవి తీసుకున్నటువంటి 'జియా జింగ్'‌ ఐప్యాడ్ 2 కోనుగోలు చేసి తన ఇంటికి వెళ్శినట్లు వెల్లిడించారు.

అలా ఇంటికి వెళ్శిన తర్వాత 'జియా జింగ్'‌ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ఖరీదైన ఫోన్‌ని చూసి నీకు ఇంత ఖరీదైన ఫోన్ ఎక్కడది అని వాళ్శ అమ్మ అడుగుగా మొదట్లో చెప్పడానికి ఖంగారు పడినటువంటి 'జియా జింగ్'‌ ఆ తర్వాత మెల్లగా జరిగిన విషయాన్ని తల్లికి పూసగుచ్చినట్లు చెప్పడం జరిగింది. దాంతో 'జియా జింగ్'‌ తల్లి, 'జియా జింగ్'‌ ఇద్దరూ తిరిగి హాస్పిటల్ వద్దకు వెళ్శి విచారించగా పుజియన్ ప్రోవెన్స్‌‌‌‌లో ఉన్నటువంటి ఓ బిజినెస్ మ్యాన్ ఆ కిడ్నీని వ్యాపార నిమిత్తం వాడినట్లు తెలిసింది. దీంతో 'జియా జింగ్'‌ తల్లి చాలా విధాలుగా ఆ ఏజెంట్స్‌ని కలుద్దామని ప్రయత్నించడం, ఎన్ని సార్లు ఫోన్ చేసినప్పటికీ అతని ఫోన్ స్విచ్చాఫ్ అని రావడంతో నిరుత్సాహాపడడం జరిగింది. 'జియా జింగ్'‌ తల్లి మాత్రం ఎలాగైనా సరే ఆ క్రిమినల్స్‌ని పట్టుకోని తీరుతామని అన్నారు. ఇది ఇలా ఉంటే 'జియా జింగ్'‌ ఆరోగ్యం మాత్రం రోజురోజుకి కొంచెం క్షీణిస్తున్నట్లు సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot