ఇంటర్నెట్ బ్రౌజింగ్ మరింత సులభతరం

గ్రామీణ ప్రాంతాల్లో సైతం అంతర్జాల (ఇంటర్నెట్) వినియోగాన్ని సులభతరం చేస్తూ కొత్త తరహా ఆవిష్కరణకు ప్రాసెసర్ల తయారీ సంస్థ ఇంటెల్ శ్రీకారం చుట్టింది. ‘దర్ఫణ్’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను ఇంటెల్ లాంచ్ చేసింది. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లిషు, గుజరాతీ, మరాఠీ వంటి 6 భాషల్లో దర్పణ్ లభిస్తుంది. ఇంటర్నెట్‌ను వినియోగించుకునేందుకు బ్రౌజర్ ఉపయోగించాల్సిన పని లేకుండా ఇది సహాయకారిగా ఉంటుంది. కంప్యూటర్‌లోకి దర్పణ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఏ భాషలో సమాచారం కావాలనుకుంటున్నది తెలియచేస్తే ఆ భాషకు సంబంధించిన సమాచారం అందుకోగలుగుతారు. దర్పణ్ హోం పేజీపై న్యూస్, గేమ్స్, మార్కెట్ వంటి గుర్తులు కనిపిస్తాయి, వాటిపై క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై వస్తుంది.
ల్యాప్‌టాప్.. టాబ్లెట్ కలయకతో అల్ట్రాబుక్:
స్లిమ్ అదేవిధంగా ఆకర్షణీయమైన పరిమాణం కలిగిన అల్ట్రాబుక్ లను ఇంటెల్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ల్యాప్ టాప్ అదేవిధంగా టాబ్లెట్ కంప్యూటర్ లక్షణాలను ఈ అల్ట్రాబుక్ లు ఒదిగి ఉంటాయి. ఈ డివైజ్ లో అమర్చిన ఇంటెల్ ప్రాసెసర్లు వేగవంతమైన పనితీరును కలిగి ఉంటాయి. రూ.50,000 నుంచి రూ.58,000 ధరల్లో ఇవి లభిస్తున్నాయని ఇంటెల్ సౌత్ ఆసియా సేల్స్ డెరైక్టర్(సౌత్) బి.సూర్యనారాయణన్ తెలిపారు.


Click it and Unblock the Notifications








