తెలంగాణ సమస్యను త్వరగా తేల్చండి: చిరంజీవి

Posted By: Staff

తెలంగాణ సమస్యను త్వరగా తేల్చండి: చిరంజీవి

హైదరాబాద్: తెలంగాణ సమస్యను త్వరగా తేల్చాలని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి కేంద్రానికి, కాంగ్రెసు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని సున్నితమైన అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అయితే పరిష్కారం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను గమనించి సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొనకముందే సమ స్య పరిష్కారానికి చొరవ చూపాలని, తద్వారా రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు. 'రాష్ట్రంలో కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రతి ఒక్కరినీ కలచి వేస్తున్నాయి.

కొనసాగుతున్న అమాయకుల ఆత్మహత్యలు, చెదురుమదురు హింసాత్మక సంఘటనలు, భౌతిక దాడులు, బంద్‌ల పట్ల సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని, ఒకరినొకరు దూషించుకోవడం, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు - సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. లక్ష్యాలు ఎంత పవి త్రమో వాటిని సాధించే మార్గాలూ అంతే పవిత్రంగా ఉండాలన్న గాంధీ మాటల్ని గుర్తుచేశారు. ఇప్పటికే ఎన్నో రకాలుగా నష్టపోయామని ఆయన అన్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting