గూగుల్ తో కలసి ఉచితంగా హై-స్పీడ్ పబ్లిక్ వై-ఫైను అందించనున్న సిస్కో

|

గ్లోబల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం సిస్కో గూగుల్ సంస్థతో భాగస్వామ్యమై ప్రపంచవ్యాప్తంగా ఉచిత హై-స్పీడ్ వై-ఫై యాక్సెస్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో ప్రారంభించింది. ఈ భాగస్వామ్యంలో మొదటగా బెంగళూరులోని ముఖ్యమైన 35 ప్రదేశాలలో ప్రారంభించబడింది.

 
cisco to offer free high speed public wi fi with google station in india

సిస్కో గూగుల్ యొక్క "స్టేషన్ ప్లాట్‌ఫాం" తో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమ్యూనిటీలకు ఉచిత పబ్లిక్ వై-ఫై యాక్సిస్ ఇవ్వనుంది.సిస్కో ప్రకారం ఈ పరికరాన్ని తయారు చేయడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే ఈ దేశంలో ఇంటర్నెట్ ప్రాథమిక హక్కుగా ఉండాలి.ప్రస్తుతం భారతదేశంలో హాఫ్(1/2) బిలియన్ మంది ప్రజలు ఆన్‌లైన్‌లో ఉండగా 800 మిలియన్ల మంది ఇప్పటికీ ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేయలేకపోతున్నారు.

టెలికాం సదుపాయాలు:

టెలికాం సదుపాయాలు:

టెలికాం మౌలిక సదుపాయాలు సర్వత్రా మరింత ఆకర్షణీయంగా మారినప్పటికీ ఆన్‌లైన్‌లో లేని 800 మిలియన్ల మంది భారతీయులను కనెక్ట్ చేయడానికి హై-స్పీడ్ డేటా చాలా కీలకం. నిజమైన డిజిటల్ ఎకానమీ యొక్క సామర్థ్యాన్ని గ్రహించటానికి విశ్వసనీయమైన మరియు హై-స్పీడ్ పబ్లిక్ ఒక కీలకమైన బిల్డింగ్ బ్లాక్ అని రెండు సంస్థలు తెలిపాయి.

బెంగళూరులో  వై-ఫై స్థానాలు:

బెంగళూరులో వై-ఫై స్థానాలు:

ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బెంగళూరులో మరొక 200 స్థానాలలో వై-ఫై ఎనేబుల్ అవుతాయని మరియు రెండో దశలో మరో 300 స్థానాలు ఉంటాయని సిస్కో తెలిపింది. ఈ ప్రదేశాలలో బస్ స్టాప్లు, ఆసుపత్రులు మరియు ప్రభుత్వ కార్యాలయాలు మొదలైన బహిరంగ ప్రదేశాలు ఉన్నాయి.

ఇండియాలో వై-ఫై డిమాండ్:
 

ఇండియాలో వై-ఫై డిమాండ్:

భారతదేశంలోని ప్రతిఒక్కరికీ ఉచిత, బహిరంగ, అధిక-నాణ్యత గల ఇంటర్నెట్ సదుపాయాన్ని తీసుకురావడానికి గూగుల్‌తో భాగస్వామ్యం కావడానికి మేము సంతోషిస్తున్నాము అని సిస్కో ఇండియా మరియు సార్క్ అధ్యక్షుడు సమీర్ గార్డ్ అన్నారు.

ఇది గణనీయమైన వృద్ధి అవకాశాన్ని కూడా సూచిస్తుంది. రాబోయే 3 సంవత్సరాల్లో పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌ల డిమాండ్ 100X పెరుగుతుందని తెలిపారు. అంతే కాకుండా సిస్కో మరియు గూగుల్ భాగస్వాములకు కొత్త మార్కెట్లను సృష్టిస్తుంది అని ఆయన చెప్పారు.

 

గూగుల్ పే మేనేజింగ్ డైరెక్టర్:

గూగుల్ పే మేనేజింగ్ డైరెక్టర్:

గూగుల్ పే మరియు" నెక్స్ట్ బిలియన్ యూజర్ ఇనిషియేటివ్స్ "మేనేజింగ్ డైరెక్టర్ మరియు బిజినెస్ హెడ్ సజిత్ శివానందన్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మేము భద్రతకు కట్టుబడి ఉన్నాము. ఇది మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు చేసే అదే వాతావరణం httpsలో నడుస్తుంది. ఈ సర్వీస్ కు ప్రకటనల ద్వారా పూర్తి మద్దతు ఉంటుంది. సేవను వాణిజ్యపరంగా అందుబాటులో ఉంచడానికి మేము మరిన్ని ఉత్పత్తుల గురించి ఆలోచిస్తాము అని తెలిపారు.

TRAI నివేదిక:

TRAI నివేదిక:

TRAI నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 150 మందికి వై-ఫై హాట్‌స్పాట్ ఉంది. ఇప్పుడు భారతదేశంలో కూడా అదే నిష్పత్తిని సాధించడానికి ఎనిమిది మిలియన్ల అదనపు హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఈ మౌలిక సదుపాయాల వలన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త కొత్త మార్కెట్ అవకాశాలను సృష్టిస్తుంది.

ఇండియాలో నేడు 52,000 వై-ఫై హాట్‌స్పాట్‌లు మాత్రమే ఉన్నాయి. దేశవ్యాప్తంగా హై-స్పీడ్ వై-ఫై హాట్‌స్పాట్‌లను సర్వవ్యాప్తి చేయడానికి చురుకైన వ్యూహం అవసరం.

ఎల్లపుడు రద్దీగా ఉండే నగరాలలో హై-స్పీడ్ పబ్లిక్ వై-ఫైని సాధ్యమైనంత వరకు విస్తృతంగా చేయడం ద్వారా డిజిటల్ ఇండియాను పెంచవచ్చు. ఈ దృష్టిని పెంచే విధానంలో ఇది ఒక ముఖ్యమైన భాగస్వామ్యం అని సైబర్ మీడియా రీసెర్చ్ హెడ్-ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ గ్రూప్ ప్రభు రామ్ తెలిపారు .

 

Best Mobiles in India

English summary
cisco to offer free high speed public wi fi with google station in india

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X