సిటి గ్రూప్ నుండి బంపర్ ఆఫర్ కొట్టేసిన సిఈవో విక్రమ్ పండిట్

By Super
|
Vikram Pandit
ఎన్నో సంవత్సరాలుగా వాల్ స్ట్రీట్స్‌లో చాలా తక్కువ జీతం తీసుకున్నటువంటి ఛీప్ ఎగ్జిక్యూటివ్స్‌లలో విక్రమ్ యస్. పండిట్ ఒకరు. అలాంటి విక్రమ్ పండిట్ ఇప్పుడు సిటీ గ్రూప్ జ్ఞాపకం అవార్డు క్రింద దాదాపు $23.2మిలియన్ ప్యాకేజిని తీసుకోని టాప్ లిస్ట్ లోకి చేరారు. గత రెండు సంవత్సరాలుగా సంవత్సరానికి గాను విక్రమ్ పండిట్ కేవలం $1మిలియన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది బుధవారం సిటీ గ్రూప్ బోర్డ్ ఒక్కసారిగా $16.5మిలియన్ స్టాక్ ఆఫ్షన్స్‌ని అవార్డు క్రింద ప్రకటించింది. అంతేకాకుండా స్పెషల్ ప్రాపిట్-షేరింగ్ ప్రోగ్రామ్ క్రింద టాప్ ఎగ్జిక్యూటివ్స్‌కి $6.65మిలియన్ డాలర్లు ప్రకటించింది.

సిటీ గ్రూప్ షేర్ ప్రైజ్ $4 నుండి $40కి చేరడంతో ఇటీవల విడుదల చేసినటువంటి ఐదవ క్వార్టర్లీ ప్రాపిట్ లెక్కల ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంలో సిటీ గ్రూప్ ఛైర్మన్ రిచర్డ్ యస్. పార్సన్స్ మాట్లాడుతూ విక్రమ్ ఫైనాన్సియల్ క్రిటిసిస్‌లో అతను కంపెనీకి చేసినటువంటి సేవలు నిజంగా ప్రశంసనీయం అని అన్నారు. ఈ అవార్డు విక్రమ్‌కి ఇవ్వడం వల్ల రాబోయే భవిష్యత్తులో అతని సేవలు కంపెనీకి ఇంకా బాగా ఉపయోగపడతాయని, అంతేకాకుండా షేర్ హోల్డర్స్ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారని అన్నారు.

చాలా బ్యాంక్స్ నష్టపరిహారం విషయాలలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసి, ఎక్కువ శాతం స్టాక్స్‌లో పెట్టడం జరిగింది. సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా విషయానికి వస్తే అలా కాకుండా ఫైనాన్స్ క్రిటిసిస్ లాంటి ప్రమాదం నుండి రక్షించుకోవడానికి మల్టిబుల్ గవర్నమెంట్స్‌ని ఆశ్రయించడం జరిగింది. ఇలాంటి అన్ని విషయాలలో పండిట్ 2009సంవత్సరం నుండి కంపెనీని ముందుండి నడిపించడం జరిగింది. అంతేకాకుండా కేవలం $1 తీసుకోని సిటీ గ్రూప్ నుండి లాభాల బాటలో నడిపించడంలో తనదైన ముద్రవేశారు.

ఇక్కడ మీకోక విషయం చెప్పాలి. అందరూ అనుకున్నట్లు ఇది పండిట్‌కి బోనస్ కాదు. కేవలం మా ముందు జాగ్రత్త మాత్రమే. ఎన్నో సంవత్సరాలుగా మా కంపెనీలో సేవలు అందించినందుకుగాను మేము ఇచ్చినటువంటి అవార్డు. 2013 నుండి 2015 వరకు మూడు విడతలుగా విక్రమ్ పండిట్‌కి ఈ అవార్డు అందివ్వడం జరుగుతుంది. గత జనవరిలోనే సిటి గ్రూప్ విక్రమ్ పండిట్ జీతాన్ని $1మిలియన్ నుండి $1.75 మిలియన్ వరకు పెంచడం జరిగింది. ఇక బ్యాంక్ ఆఫ్ అమెరికా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ బ్రియాన్ టి మోనిహాన్ 2010వ సంవత్సరానికి గాను మొత్తం పరిహారం $10.2మిలియన్ అందుకోవడం జరిగింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X