FIRని ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు !
7 రకాలైన నేరాలపై ఎఫ్‌ఐఆర్(ప్రాథమిక సమాచార నివేదిక)లను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవడంతోపాటు, సంబంధిత సేవలు పొందే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది.
7 రకాలైన నేరాలపై ఎఫ్‌ఐఆర్(ప్రాథమిక సమాచార నివేదిక)లను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవడంతోపాటు, సంబంధిత సేవలు పొందే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంశాఖ స్మార్ట్ పేరుతో రూపొందించిన ఈ విధానం దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో వివిధ నేరాలకుపై ఆన్‌లైన్‌లోనే పోలీసులకు ఫిర్యాదులు చేయవచ్చు. దీంతోపాటు నర్సులు, ఇళ్లలో కిరాయిదారులు, డ్రైవర్లకు సంబంధించిన సమాచారం వెరిఫికేషన్‌కు, సభలు, సమావేశాలు పెట్టుకునేందుకు అనుమతులు, వాహనం చోరీకి గురైనా, పోగొట్టుకున్న లేదా దొరికిన వస్తువులకు సంబంధించి ఆన్‌లైన్ ద్వారా సమాచారం పొందవచ్చు. ఈ వెబ్‌పోర్టల్‌లో అందిన ఫిర్యాదులు, వినతులను నేరుగా సంబంధిత రాష్ట్రాలకు పంపి, తక్షణం చర్యలు తీసుకునేలా సూచనలిస్తారు. కోరిన సమాచారాన్ని ఫిర్యాదుదారుకు మెయిల్‌లో పంపుతారు.

హ్యాకర్ల భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎలా ?
మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే
మీ వెబ్‌సైట్‌ను హ్యాకర్ ప్రూఫ్‌గా ఉండాలంటే మీ వెబ్‌సైట్‌లోని సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ అందుకుఅనుగుణంగా సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఈ చర్యను క్రమంగా పాటించినట్లయితే హ్యాకర్లు విజృంభించే అవకాశం ఉండదు.

శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను
శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించటం ద్వారా హ్యాకర్ల చొరబాటును నిరోధించవచ్చు

గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో రిజిస్టర్ అయినట్లయితే
మీ వెబ్‌సైట్, గూగుల్స్ వెబ్ మాస్టర్ టూల్స్‌లో రిజిస్టర్ అయినట్లయితే మాల్వేర్ దాడులు జరిగిన సమయంలో తక్షన నోటిఫికేషన్ మీకు అందుతుంది. తద్వారా రక్షణాత్మక చర్యలకు పూనుకోవచ్చు.

హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో..
ప్రముఖ వెబ్ కంపెనీలు హ్యాకర్ల భారి నుంచి రక్షణ పొందే కమ్రంలో సెక్యూరిటీ సేవలనందించే సంస్థలను నియమించుకుంటున్నాయి.

హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను
ఈ సంస్థలు హ్యాకింగ్ నిరోధానికి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాలను కలిగి సదరు కంపెనీ వెబ్‌సైట్‌కు సంబంధించి నిరంతర పర్యవేక్షణను నిర్వహిస్తాయి.

స్టాప్ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ
స్టాప్ ద హ్యాకర్, సైట్ లాక్, సుకురీ, క్వాలిస్ వంటి సంస్థలు ఈ తరహా సెక్యూరిటీ సేవలనందిస్తున్నాయి.

సంవత్సారినికి కొంత మొత్తం
ఈ సెక్యూరిటీ సంస్థలను నియమించుకున్నట్లయితే సంవత్సారినికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








