Home
News

4 ఏళ్ల బాలుడి గేమ్ పిచ్చికి తండ్రి బ్యాంక్ అకౌంట్ ఖాళీ

By Gizbot Bureau

ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడ్డ ఓ మైనర్‌ బాలుడు దెబ్బకు ఓ తండ్రి తన బ్యాంకు అకౌంట్లో ఉన్న మొత్తాన్ని తనకు తెలియకుండానే కోల్పోవలిసి వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా ఆ మైనర్ బాలుడి నడిపిన తతంగం ఆ తండ్రికి పోలీసులు చెప్పేదాకా తెలియలేదంటే ఆ బాలుడు ఎలా నడిపాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పోలీసులకు సైతం ముచ్చెమటలు పట్టించిన ఈ కేసు ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే..

Class 4 boy creates Paytm account for father, steals Rs 35,000 for online games

Hazratganj station పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడు చిన్నతనం నుంచే ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. తర్వాత అదే ఆటలకు బానిసైన ఆ మైనర్‌ డబ్బుల కోసం తండ్రికే ఎసరు పెట్టాడు. సాధారణంగా అనేక ఆన్‌లైన్‌ గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం కోసం ఆన్‌లైన్‌ చెల్లింపులు తప్పనిసరి. దీంతో ఆ బాలుడు డబ్బుల కోసం తండ్రి మొబైల్‌లో పేటీఎమ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి దానికి బ్యాంక్‌ అకౌంట్‌ను జతపరిచాడు.
Class 4 boy creates Paytm account for father, steals Rs 35,000 for online games

2018 డిసెంబర్‌నుంచి ఇలా ప్రారంభించి, తండ్రికి అనుమానం కలగకుండా దాన్ని రహస్యంగా ఉంచాడు. అంతేగాక పేటీఎమ్‌ వాలెట్‌లో డబ్బులు అయిపోయినప్పుడల్లా మళ్లీ బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసి మరీ గేమ్‌లు ఆడేవాడు. ఈ నేపథ్యంలో సంవత్సరంలో దాదాపు 35 వేల రూపాయలను గేమ్‌లపై వెచ్చించాడు. తన అకౌంట్‌ను నుంచి డబ్బులు మాయమవుతుండాన్ని గమనించిన తండ్రి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రాథమిక విచారణలో.. డబ్బులు బదిలీ అయిన ఫోన్‌ నంబర్‌ తనదే అని చెప్పడంతో తండ్రి ఆశ్చర్యానికి గురయ్యాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు వేరే దారి లేక అనుమానం వచ్చి తన కొడుకును విచారించగా వాస్తవాలు బహిర్గతమయ్యాయి.

చివరకు పిల్లవాడు తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో సొంత కుమారుడే డబ్బులు కాజేశాడని తేలడంతో ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. అనంతరం సైబర్‌ పోలీసు సిబ్బంది బాలుడికి కౌన్సెలింగ్‌ ఇప్పించి ఇంటికి పంపించారు. ఇలాంటి విషయాల్లో పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

Best Mobiles in India

English summary
Class 4 boy creates Paytm account for father, steals Rs 35,000 for online games
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X