ఏడవ తరగతిలోనే డేటా సైంటిస్ట్ అయ్యాడు

By Gizbot Bureau
|

సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దీనిని ప్రతి ఒక్కరు కూడా వేగంగా నేర్చుకుంటున్నారు.నేటి యువతరం సాఫ్ట్వేర్ రంగంలో ఉపాధిని వెతుక్కుంటూ కొత్త కొత్త కోర్సులను నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు.ఇక ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలకంగా మారాయి.వీటిలో నిష్ణాతులైన వారికి కంపెనీలు ఐదంకెల జీతాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఏడవ తరగతి పిల్లవాడు డేటా సైంటిస్టుగా జాబు కొట్టి అందర్నీ అబ్బురపరిచాడు.

సిద్ధార్థ శ్రీవాత్సవ్ పిల్లే

అతి చిన్న వయస్సులోనే ఓ బాలుడు సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ సంపాదించి ఔరా అనిపిస్తున్నాడు. నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న సిద్ధార్థ శ్రీవాత్సవ్ పిల్లే అనే బాలుడిని డాట సైంటిస్ట్ గా నగరంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నియమించింది. 

తండ్రి ప్రోత్సాహంతో

పిన్న వయస్సులోనే సైన్స్ అండ్ టెక్నాలజీ, కోడింగ్ పై ఎంతో ఆసక్తిని పెంచుకున్న సిద్ధార్థ్.. తండ్రి ప్రోత్సాహంతో తన సైన్స్ పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపర్చుకున్నాడు. దీంతో సిద్ధార్థ్ సైన్స్ స్కిల్స్ చూసిన మాంటైగ్నే స్మార్ట్ బిజినెస్ సొల్యుషన్స్ అతడికి జాబ్ ఆఫర్ ఇచ్చింది.

తన్మయ్ భక్షి తనకు ఆదర్శం
 

చాలా యంగ్ ఏజ్ లో గూగుల్ లో జాబ్ సంపాదించిన తన్మయ్ భక్షి తనకు ఆదర్శమని సిద్ధార్థ్ చెబుతున్నాడు. సమాజానికి సేవ చేయడమే తన లక్ష్యమని ఈ యువ డేటా సైంటిస్ట్ తెలిపాడు. కాగా 23 ఏళ్లకు ఇంజినీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ రంగంలో నిష్ణాతులు కాలేక నిరుద్యోగులుగా ఉన్న యువతరం ఇప్పుడు చాలామంది ఉన్నారు. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో 

సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న తన తండ్రి స్ఫూర్తితో క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్న సిద్ధార్థ శ్రీవాస్తవ్ అనే పిల్లడు ఏడో తరగతి చదువుతూ మరో వైపు వీడియో గేమ్ మీద ఆసక్తితో తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో కోడింగ్ చేయడం మొదలు పెట్టానని తెలిపాడు.కోడింగ్ మీద అనుభవం సంపాదించిన శ్రీవాత్సవ్ డేటా సైంటిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ఊహించని విధంగా ఎంపికయ్యాడు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దూసుకుపోతున్న సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో తన మార్క్ చూపించాడు.

Best Mobiles in India

English summary
Class 7 Hyderabad student hired by a software company to work as data scientist

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X