జఫెరా ఎల్‌ఎల్‌సి కొనుగోలు చేసిన కాగ్నిజెంట్

Posted By: Super

జఫెరా ఎల్‌ఎల్‌సి కొనుగోలు చేసిన కాగ్నిజెంట్

నాస్‌డాక్ లిస్ట్‌లో రిజస్టర్ అయిన ఇన్పర్మేషన్ టెక్నాలజీ కంపెనీ కాగ్నిజెంట్ మంగళవారం రిటైల్ కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థ, జఫెరా ఎల్‌ఎల్‌సి కంపెనీని కొనుగోలు చేశామని వెల్లడించింది. ఈ కంపెనీని కొనుగోలు చేయడం వల్ల శాప్ కన్సల్టింగ్, రిటైల్ దిగ్గజ కంపెనీలకు సాఫ్ట్‌వేర్ సేవలందించే విషయంలో మరింత పటిష్టంగా తయారవుతామని పేర్కొంది.

రాబోయే కాలంలో రిటైలర్ల మార్జిన్లు తగ్గుతున్నాయని, వినియోగదారులను ఆకట్టుకొని, నిలబెట్టుకోవడం రిటైల్ సంస్థలకు గట్టి సవాల్‌గా మారుతోందని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు. ఈ సవాళ్లను అధిగమించడమే కాకుండా, మల్టీ ఛానల్ రిటైలింగ్ ద్వారా లభ్యమయ్యే అపార అవకాశాలు రిటైలర్లు అందిపుచ్చుకోవడానికి అవసరమైన సొల్యూషన్లను అందించడానికి జఫెరా కొనుగోలు తమకు దోహదపడుతుందని డిసౌజా పేర్కొన్నారు.

ఇక కాగ్నిజెంట్ గురించి చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా 50 డెలివరీ సెంటర్స్, ఉద్యోగులు విషయానికి వస్తే సుమారుగా లక్షవరకు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఈ కంపెనీని కొనుగోలు రాబోయే కాలంలో కాగ్నిజెంట్ మరింత అభివృద్దికి దోహాదపడుతుందని అన్నారు. జఫెరా ఎల్‌ఎల్‌సి కంపెనీని ఎంతకు కొనుగోలు చేశారనే విషయం మాత్రం ప్రస్తావించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot