విప్రోని అధిగమించిన కాగ్నిజెంట్ టెక్నాలజీ సోల్యూషన్స్

By Super
|
Cognizant Technology Solutions
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2010-11)లో దేశీయ ఐటీ పరిశ్రమ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించింది. దేశంలోని 200 ఐటీ కంపెనీలు 84 బిలియన్‌ డాలర్ల (రూ.3,84,250 కోట్లు) ఆదాయాన్ని పొందాయి. సైబర్‌ మీడియా నిర్వహించిన ఓ సర్వేలో దేశీయ ఐటీ కంపెనీలు గత నాలుగేళ్ళలో ఎన్నడూ లేనంతగా 2010-11లో 25 శాతం వృద్ధిని నమోద చేసినట్లు తేలింది. 2007-08 ఆర్థి క సంవత్సరంలో ఐటీ పరిశ్రమ ఆదాయం 24 శాతం పెరి గిందని, అయితే గత ఆర్థిక సంవత్సరం ఆ గణాంకాలను ఐటీ సంస్థలు అధిగమించాయని పేర్కొంది. 2008-09లో రూ.2,89,093 కోట్ల ఆదాయాన్ని సాధించిన భారత ఐటీ రంగం..2009-10లో రూ.3,07,126 కోట్లకు చేరింది.

కాగా గత ఆర్థిక సంవత్సరం దేశంలోని 200 ఐటీ సంస్థలు నమోదు చేసిన మొత్తం 84 బిలియన్‌ డాలర్ల ఆదాయంలో మొదటి 20 సంస్థలే 54 బిలియన్‌ డాలర్ల (రూ.2,47,808 కోట్లు) ఆదాయం హస్తగతం చేసుకోవడం గమనార్హం. అత్యధిక ఆదాయాన్ని పొందిన 10 ఐటీ సంస్థల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌పి ఇండియా, కాగ్నిజెంట్‌, ఐబిఎమ్‌ ఇండియా, హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌సిఎల్‌ ఇన్ఫోసిస్టమ్స్‌, ఇంగ్రమ్‌ మైక్రో ఇండియా, రెడింగ్టన్‌ ఇండియాలున్నాయి. ఇదిలావుంటే ఆదాయం సంపాదించిన 200 ఐటీ కంపెనీల్లో 129 దేశీయ సంస్థలుండగా, మరో 71 విదేశీ సంస్థలున్నాయి.

ఇది ఇలా ఉంటే జూన్ తో ముగిసిన రెండో క్వార్టర్‌కు 20.8 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించామని కాగ్నిజంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్ మంగళవారం తెలిపింది. గత ఏడాది ఇదే కాలానికి ఆర్జించిన నికర లాభం(17.2 కోట్ల డాలర్లు)తో పోలిస్తే, 21 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం 110 కోట్ల డాలర్ల నుంచి 34 శాతం వృద్ధి చెంది 148 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపింది. ఆదాయం విషయంలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న విప్రోను కాగ్నిజంట్ అధిగమించింది. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల తర్వాత స్థానం కాగ్నిజంట్‌దే. విప్రో ఆదాయం 140 కోట్ల డాలర్లుగా నమోదైంది. మూడో క్వార్టర్‌లో 157 కోట్ల డాలర్ల ఆదాయం, 2011 క్యాలండర్ సంవత్సరం మొత్తానికి 606 కోట్ల డాలర్ల ఆదాయం అంచనా వేస్తున్నామని పేర్కొంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X