కాగ్నిజెంట్‌ Q1 నికరలాభం 113.1మిలియన్ అమెరికా డాలర్లు

Posted By: Staff

కాగ్నిజెంట్‌ Q1 నికరలాభం 113.1మిలియన్ అమెరికా డాలర్లు

అమెరికాకు చెందిన ఐటి సర్వీసెస్‌ కంపెనీ కాగ్నిజెంట్‌ మంగళవారం నాడు మార్చి 31తో ముగిసిన మొదటి తైమాసిక ఫలితాలు వెల్లడించింది. Q1లో 37.5 శాతం వృద్ధితో 208.32 మిలియన్‌ డాలర్లు ఆదాయాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది 2010లో 151.50 మిలియన్‌ డాలర్లు గడించింది. మొదటి త్రైమాసికంలో కూడా మంచి వృద్ధిని సాధించామ ని... డిమాండ్‌ను చక్కగా వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకున్నామని.. వ్యాపారంలో తమ క్లయింట్‌లతో అనుసరించాల్సిన పంధాను కూడా మార్చుకున్నామని.. మార్కెట్‌లో వివిధ మార్గాలలో పోటీపడతామని కాగ్నిజెంట్‌ సీఈవో, ప్రెసిడెంట్‌ ఫ్రాన్సిస్కో డీ సౌజా ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జనవరి - మార్చి - 2011లో కంపెనీ రెవెన్యూ 42.88 శాతం 1.37 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాది 959.72 మిలియన్‌ డాలర్లు. రెండవ త్రైమాసికం తో కంపెనీ రెవెన్యూ 1.45 బిలియన్‌ డాలర్ల లక్ష్యంగా ముందుకు సాగుతా మని.. 2011 పూర్త య్యే నాటికి మొత్తం రెవెన్యూలో 29 శాతం వృద్ధిని సాధించి 5.92 బిలియన్‌ డాలర్ల మేరకు తీసుకువెళతామని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో తమ ముద్రను కొనసాగిస్తూ ముందుకు పోతామని నికర లాభంలో 19-20 శాతం స్థాయి టార్గెట్‌ను కొనసాగిస్తామని కాగ్నిజెంట్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోర్డాన్‌ కోబన్‌ చెప్పారు. మార్చి 31, 2011 నాటికి కంపెనీ చేతిలో నగదు లేదా నగదుతో సమానమైన బాండ్లు 1.29 బిలియన్‌ డాలర్లు ఉన్నట్లు... ఈ త్రైమాసికంలో కంపెనీ 7,200 మందికి పైగా కొత్త ఉద్యోగులను తీసుకున్నట్లు తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot