విశ్వరూపం.. వివిధ కోణాల్లో

Posted By:

విలక్షణ నటుడు కమల్ హాసన్ భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా విశ్వరూపం. ఆది నుంచి వివాదాలతో సతమతమైన ఈ స్పై థ్రిల్లర్ నాటకీయ పరిణామాల నడుమ విడుదలకు ముస్తాబైంది. వివరాల్లోకి వెళితే... విశ్వరూపం చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ పలు ముస్లిం సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జనవరి 25న విడుదల కావాల్సిన ‘విశ్వరూపం' చిత్రంపై రెండు వారాల బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే....ముఖ్యమంత్రి జయలలిత కమల్ హాసన్‌పై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విశ్వరూపం చిత్రాన్ని నిలిపి వేసిందనే ప్రచారం మీడియాలో జరిగింది. రాజకీయాల్లో పావును అయ్యాను, ఇలా అయితే దేశం విడిచిపోతాను అని కమల్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచి చేసింది. మొత్తానికి ముస్లిం సంఘాలతో చర్చల అనంతరం కొన్ని సీన్లకు కత్తెర వేసిన అనంతరం విశ్వరూపం చిత్రం ఈ రోజు తమిళనాడులో విడుదలకు సిద్ధమైంది.

కమల్ అభిమానుల కోసం విశ్వరూపం సినిమాకు సంబంధించి పలు ప్రత్యేక ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కనువిందు చేస్తున్నాయి. వీటిని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా కమల్ స్పై థ్రిల్లర్ విశ్వరూపం సినిమాకు సంబంధించి వాల్ పేపర్లు, ట్రెయిలర్లు, వీడియో క్లిప్పింగ్స్, సాంగ్స్ ఇంకా సోషల్ ఫీడ్‌బ్యాక్‌లను ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పొందవచ్చు. విశ్వరూపం చిత్రానికి సంబంధించి టాప్-4 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను మీ ముందుంచుతున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విశ్వరూపం (Vishwaroopam):

ఈ అప్లికేషన్‌ను సోనీ మ్యూజిక్ ఇండియా వృద్ధి చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు గూగుల్‌ప్లే స్టోర్ నుంచి ఈ అప్లికేషన్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా విశ్వరూపం చిత్రానికి సంబంధించి వాల్ పేపర్లు, వీడియోలు, పాటలు ఇంకా సోషల్ ఫీడ్‌బ్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లింక్:

విశ్వరూపం గ్యాలరీ (Vishwaroopam Gallery):

గూగుల్‌ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న విశ్వరూపం గ్యాలరీ అప్లికేషన్‌లో సినిమాకు సంబంధించి అనేక వాల్ పేపర్‌లను గ్యాలరీ రూపంలో నిక్షిప్తం చేశారు. యూజర్ ఈ అప్లికేషన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా చిత్రానికి సంబంధించి నచ్చిన వాల్‌పేపర్‌లను ఫోన్ వాల్ పేపర్‌గా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మెయిల్, బ్లూటూత్, ట్విట్టర్‌ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

విశ్వరూపం వాల్ పేపర్ & వీడియో (Vishwaroopam Wall Paper&Video):

ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను మొబైల్ కరెంట్స్ వృద్ది చేసింది. యూజర్ ఈ అప్లికేషన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా చిత్రానికి సంబంధించి నచ్చిన వాల్‌పేపర్‌లను ఫోన్ వాల్ పేపర్‌గా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మెయిల్, బ్లూటూత్, ట్విట్టర్‌ల ద్వారా మిత్రులకు షేర్ చేసుకోవచ్చు. లింక్ అడ్రస్:

విశ్వరూపం (Vishwaroopam):

ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ విశ్వరూపం చిత్రాన్ని అభిమానులకు మరింత చేరువచేస్తుంది. యూజర్ ఈ అప్లికేషన్‌ను వినియోగించుకోవటం ద్వారా సినిమాకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ల రూపంలో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ట్రెయిలర్‌లు, వీడియోలు ఇంకా ఫోటోలను వీక్షించవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot