నిజమెంత,రూ. 60కే నెలంతా అపరిమిత డేటా, రూ. 500కే 4జీ స్మార్ట్‌ఫోన్ !

Written By:

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో ఓ సంచలనం. జియో అరంగేట్రం చేసినప్పటి నుంచి భారత టెలికాం రంగంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఉచితంగా అన్‌లిమిటెడ్ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లతో పాటు పలు ఆఫర్లను జియో దిగ్గజాలకు చుక్కలు చూపించింది. ఆకాశంలో ఉన్న డేటా ధరలను నేలమీదకు తీసుకువచ్చింది. వాటి పని పట్టిన వెంటనే జియోఫోన్‌' పేరుతో ఫీచర్‌ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ దెబ్బతో మొబైల్ తయారీ దిగ్గజాలకు షాకిచ్చింది.అయితే ఇప్పుడు జియోకి షాక్ ఇచ్చేందుకు టెలికాం దిగ్గజాలు ముగ్గురు ఒక్కటైనట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి.

28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 3జిబి డేటా, అపరిమిత కాల్స్, తక్కువ ధర..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోఫోన్ దెబ్బకి..

జియోఫోన్ దెబ్బకి కుదేలయిన ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్‌ లాంటి టెలికాం దిగ్గజాలు ఇప్పుడు బడ్జెట్‌ ఫోన్లపై దృష్టి సారించాయి. ఈ ఫోన్ లాంచింగ్ సమయంలోనే సరికొత్త ఆఫర్లతో దఏశంలో ఎక్కవమందిని ఆకర్షించేలా ఈ కంపెనీలు ప్రణాళికలు వేయనున్నాయి.

టాప్ 3 ఆపరేటర్లు..

భారత్‌లో టాప్ 3 ఆపరేటర్లు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్.. ఫీచర్ ఫోన్ల కన్నా తక్కువ ధర రూ.500కే 4జీ స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు హ్యాండ్‌సెట్ కంపెనీలతో చర్చిస్తున్నాయి.

నెలకు రూ.60-70కే

దీంతో పాటు అధిక వాయిస్, డేటాను కేవలం నెలకు రూ.60-70కే ఆఫర్ చేయనున్నాయి. ఈ ఫోన్ కి మరి జియోఫోన్ లాగా షరతులు ఉంటాయా లేక అదే ధరతో మార్కెట్లోకి తీసుకువస్తాయా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

ఫీచర్‌ ఫోన్ల ధరల స్థాయిలో..

కాగా ‘కంపెనీలతో కలిసి మేం తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం' అని ఓ టెలికాం సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ అన్నారు. ఫీచర్‌ ఫోన్ల ధరల స్థాయిలో స్మార్ట్‌ఫోన్లను అందించాలనేది తమ లక్ష్యమని మరో ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.

ఈ వార్తలపై..

అయితే ఈ వార్తలపై ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సంస్థ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇప్పటికే రూ.1500 సెక్యూరిటీ బాండ్‌తో జియోఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్లను జియో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్లను

కాగా.. జియో తర్వాత ఎయిర్‌టెల్‌, వొడాఫోన్లు రూ. 1500కంటే తక్కువ ధరకే ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కార్బన్‌, మైక్రోమాక్స్‌ లాంటి మొబైల్‌ తయారీ సంస్థలతో కలిసి ఈ ఫోన్లను విడుదల చేశాయి.

జియో కన్నా ముందుగా..

ఈ ఫోన్లకు వినియోగదారుల నుంచి కూడా విశేష ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈసారి జియో కన్నా ముందుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న మిగతా సంస్థలు మరో బంపర్ బొనాంజాతో ముందుకు వస్తున్నాయని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Coming soon: 4G smartphones at Rs 500, on a monthly plan of Rs 60 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot