గూగుల్ కొత్త ఆపరేటింగ్: 'ఆండ్రాయిడ్ జెల్లీ బీన్'

సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త వర్సన్‌ని విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. గూగుల్ విడుదల చేయనున్న ఈ సరిక్రొత్త ఆపరేటింగ్ సిస్టమ్ పేరు 'ఆండ్రాయిడ్ జెల్లీ బీన్'. జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని గూగుల్ ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో విడుదల చేయనుందని సమాచారం. జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు తైవాన్ కంపెనీ పరికరాలను ఉత్పత్తి చేయనుంది.
ఇటీవల కాలంలో విడుదల చేసిన లేటేస్ట్ ఆండ్రాయిడ్ ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ స్మార్ట్ ఫోన్స్‌తో పాటు, టాబ్లెట్స్‌కి కూడా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఐతే త్వరలో విడుదల చేయనున్న ఈ జెల్లీ బీన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ముఖ్యంగా కంప్యూటర్లు, నోట్ బుక్స్ కోసం ఉపయోగించనున్నారు. ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ముందుగా విడుదల చేయక పోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆండ్రాయిడ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు మంచి పేరు రావడమే.
ఐతే ఆండ్రాయిడ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల టాబ్లెట్స్, స్మార్ట్ ఫోన్స్‌కి చక్కగా సెట్ అవుతుంది. ఇక జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రత్యేకతలను గమనిస్తే డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ మాదిరి పని చేస్తుంది. ఇందులో నిక్షిప్తమైన బూస్టింగ్ ఆఫ్షన్‌తో సిస్టమ్‌ని రీస్టార్ట్ లేదా రీబూట్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications