గూగుల్ ప్లస్‌ని మెచ్చిన చైనా, అందుకే బ్లాక్ చేయలేదు

Posted By: Super

love Google+

బీజింగ్: గత కొంతకాలంగా చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గూగుల్ ఉపకరణాలను చాలా వరకు చైనా ప్రభుత్వం బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే గూగుల్ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ గూగుల్ ప్లస్‌ సర్వీస్‌ని మాత్రం చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం దేశంలో అందుబాటులోకి ఉంచిందని చైనా బ్లాగర్స్ వెల్లడించారు. గురువారం వాల్ స్ట్రీట్ జర్నల్‌తోటి మాట్లాడినటువంటి వేరు వేరు బ్లాగర్స్ గూగుల్ ప్లస్‌ని చైనా ప్రభుత్వం బ్లాగ్ చేయకపోవడానికి కారణం గూగుల్ ప్లస్ విడుదల అనేది చైనా ప్రభుత్వ ఇంటర్నెట్ సెన్సార్ షిప్ పాలసీకి లోబడి ఉందని తెలిపారు.


చైనా ప్రజలను ఆందోళనలకు గురి చేస్తాయన్న ఉద్దేశ్యంతో చైనాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఫ్లిక్కర్, ఫోర్ స్కేర్ లాంటి వాటిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఐతే గూగుల్ ప్లస్ లోకి లాగిన్ అవుతుంటే మాత్రం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు వెల్లడించారు. అవి ఏమిటంటే గూగుల్ ప్లస్ యుఆర్‌ఎల్ లోకి వెళ్శగానే అది HTTPS secure connectionలోకి వెళ్శడమే ఈ ప్రాబ్లమ్స్‌కి కారణం అని అంటున్నారు.


గతంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫీసియల్స్, చైనా పోలిటికల్ యాక్టివిస్ట్‌‌లకు సంబంధించినటువంటి జీమెయిల్స్ ఎకౌంట్స్ హ్యాకింగ్ చేయడం జరిగిందని టెక్నాలజీ గెయింట్ గూగుల్ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జీమెయిల్ హ్యాకింగ్ విషయంపై చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ గూగుల్‌కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్నింగ్ ఏమిటంటే జీమెయిల్ హ్యాకింగ్ చైనా ప్రభుత్వమే దగ్గరుండి మరీ హ్యాకింగ్ చేయిందని జీమోయిల్ ఆరోపిస్తుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. గూగుల్ కంపెనీ కావలనే మాపై ఆరోపణలు చేస్తుందని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot