నిపుణులు కొరతతో సతమతమవుతున్న కార్పోరేట్ కంపెనీలు

Posted By: Super

నిపుణులు కొరతతో సతమతమవుతున్న కార్పోరేట్ కంపెనీలు

నైపుణ్యం, సామర్థ్యం కలిగిన నిపుణుల కొరతతో కంపెనీలు సతమతమవుతున్నాయి. ఆయా ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం ఉన్న వారిని నియమించడం కంపెనీలకు రాను రాను చాలా కష్టంగా మారిపోతోంది. అర్హులైన వారు దొరక్క పోవడమే దీనికి కారణం. కీలక స్థాయి నిపుణులు, సిబ్బందిని నియమించడంలో దేశంలో 67 శాతం కంపెనీలు తమ లక్ష్యాలను చేరలేకపోతున్నాయని, ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సిబ్బంది సేవలందిస్తున్న 'మ్యాన్‌పవర్‌' నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఏడాది క్రితం దాదాపు 16 శాతం కంపెనీలకు మాత్రమే ఇటువంటి సమస్య ఎదురైంది.

ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరతతో సగటున 34 శాతం కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయని.. ఈ సగటు కంటే భారత్‌లో సతమతమవుతున్న కంపెనీల శాతం చాలా అధికంగా ఉందని ఆరో వార్షిక నిపుణుల కొరత అధ్యయనంలో మ్యాన్‌ పవర్‌ వెల్లడించింది. జపాన్‌లో ఈ సమస్య అత్యంత అధికంగా ఉంది. ఇక్కడ 80 శాతం కంపెనీలు తమ కీలక స్థాయి నిపుణుల నియామకంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. జపాన్‌ తర్వాత నిపుణుల కొరతతో అధిక శాతం భారత కంపెనీలే సతమతమవుతున్నాయి. గత ఏడాది 36 దేశాల్లో అధ్యయనం చేయగా.. 16 శాతంతో భారత్‌ 29వ స్థానంలో ఉంది.

భారత్‌లో నిపుణుల కొరత సమస్య జఠిలంగా మారుతోంది. గత కొద్ది త్రైమాసికాలుగా దేశంలో నిపుణులకు గిరాకీ బాగా పెరిగింది. అయితే.. కీలకమైన నైపుణ్యాలు కలిగిన నిపుణులు అందుకు తగినట్లుగా లేకపోవడం కొరతకు కారణమని మ్యాన్‌పవర్‌ అధిపతి (అమ్మకాలు, మార్కెటింగ్‌) నమ్ర కిషోర్‌ తెలిపారు. యువత ఎక్కువగా ఉన్నప్పటికీ.. వారిలో ఉద్యోగానికి అవసరమైన ఉద్యోగార్హతలు (ఎంప్లాయబిలిటీ) ఉండడం లేదు. ఇది చాలా విచిత్ర పరిస్థితి అని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot