ఆ వీడియో క్లిప్పింగ్‌తో మరోసారి వార్తలకెక్కింది!

Posted By: Prashanth

ఆ వీడియో క్లిప్పింగ్‌తో మరోసారి వార్తలకెక్కింది!

 

2012 కంప్యూటెక్స్ కార్యక్రమంలో అద్బుత సన్నివేశం చోటుచేసుకుంది. ఈ ఏడాదికి గాను సంతృప్తికర స్మార్ట్‌ఫోన్‌గా బరిలోకి దిగిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్ అసస్ ప్యాడ్ ఫోన్‌ల మధ్య కొద్దిపాటి విశ్లేషణా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోటీలో మరింత రంజును పెంచుకునేందుకు గెలాక్సీ ఎస్2ను జతచేశారు. అయితే మూడింటిలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 అత్యంత ఆకర్షణీయమైన ఫోన్‌గా రుజువైంది. 4.8 అంగుళాల సూపర్ ఆమోల్డ్ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉన్న గెలాక్సీ ఎస్3 తక్కిన రెండింటిని పక్కకు నెట్టేసింది.

నిదానమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్న గెలాక్సీ ఎస్2 మూడవ స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. చిన్న సైజ్ పరిమాణం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను ఇష్టపడే వారికి అసస్ ప్యాడ్‌ఫోన్ ఉత్తమ ఎంపిక. ఏర్ప్టాటు చేసిన డాకింగ్ స్టేషన్ స్మార్ట్‌ఫోన్‌ను టాబ్లెట్ పీసీలా మార్చేస్తుంది. ఈ ఫీచర్ ఫోన్ డిమాండ్‌ను మరింత రెట్టింపు చేస్తుంది. అయితే గెలాక్సీ ఎస్3తో పోలిస్తే అసస్ ప్యాడ్ ఫోన్ ధర అధికం. ఏదేమైనప్పటికి ఈ త్రిముఖ పోరులో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఉత్తమమైనదిగా రుజువుకాబడింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot