రచ్చ మొదలైంది.. రజనీకాంత్ "2.0" పై మొబైల్ ఆపరేటర్స్ ఫిర్యాదు
సూపర్ స్టార్ రజనికాంత్ మరియు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన రోబో 2.0 చిత్రం రేపు విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రాన్ని సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.
సూపర్ స్టార్ రజనికాంత్ మరియు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన రోబో 2.0 చిత్రం రేపు విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ చిత్రాన్ని సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు.అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల పై కొత్త వివాదాలు చెలరేగుతున్నాయి.సెల్యూలర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ఈ రోబో 2.0 మేకర్స్ పై ఫిర్యాదు దాఖలు చేసింది.కారణం ఏంటో చూడండి...

ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 2.0....
ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 2.0 అనేది మొబైల్ ఫోన్లు వళ్ళ వచ్చే రేడియేషన్లు మానవుల జీవనానికి ఎలాంటి కీడు చేస్తుంది అనేది చూయించారు .ఈ భూమి మీద బ్రతికే హక్కు మానవులకే కాదు పక్షులు మరియు జంతువులకు కూడా ఉన్నాయి అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్.

ఫిర్యాదు చేసిన లేఖలో...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మరియు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసిన లేఖలో, చిత్ర నిర్మాతలు వైజ్ఞానిక వ్యతిరేక వైఖరిని ప్రోత్సహిస్తున్నారని COAI పేర్కొంది.

మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల...
మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల హాని జరుగుతుందని, సెల్‌ఫోన్లు, మొబైల్ టవర్లు జంతుజాలానికి హానికరమని, పశుపక్ష్యాదులు, మానవుల జీవనానికి ప్రమాదకరమని సినిమాలో చూపించారని వారు ఆరోపించారు.

ఈ సినిమా యొక్క...
దీనికి తోడు, COAI ఈ సినిమా యొక్క టీజర్, ట్రైలర్, ప్రోమోషనల్ వీడియోస్ లో జారీ చేసిన సర్టిఫికేట్ ను రద్దు చేయమని CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ను కోరింది.అలాగే ఈ సినిమా యొక్క ప్రదర్శనను అడ్డుకోవాలని COAI తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది.

2.0 యొక్క ముందస్తు బుకింగ్ లు....
ఇది ఇలా ఉంటె ఈ 2.0 యొక్క ముందస్తు బుకింగ్ లు రెండు రోజుల క్రితమే ప్రారంభం అయ్యాయి.ఇప్పటికే మొదటి రెండు రోజుల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఈ సినిమాను వరల్డ్ వైడ్ 10,000 స్క్రీన్ లలో విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications