Home
News

గూగుల్‌ క్రోమ్‌ యూజర్లకు కీలక హెచ్చరిక.. వెంటనే బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోండి..!

గూగుల్‌ క్రోమ్‌ వినియోగిస్తున్నారా అయితే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT- Computer Emergency Response Team) కీలక హెచ్చరిక చేసింది. ఈ బ్రౌజర్‌లో తాజాగా భద్రతా లోపాలు గుర్తించినట్లు తెలిపింది. ఫలితంగా ఆయా కంప్యూటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందంటూ అప్రమత్తం చేసింది.

మార్చి 8న విడుదల చేసిన నివేదిక ప్రకారం గూగుల్‌ క్రోమ్‌లో (Google Chrome) అనేక లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. దీని ద్వారా అటాకర్లు ఆయా కంప్యూటర్లపై దాడి చేసే అవకాశం ఉంది. ఈ లోపాలను ఉపయోగించి ప్రత్యేక వెబ్‌పేజీల ద్వారా సైబర్‌ దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని CERT కోరింది.

Computer emergency response team issues high risk alert for google chrome users

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌, Macలో గూగుల్‌ క్రోమ్‌ వెర్షన్‌ 122.0.6261.111/.112 ముందున్న వెర్షన్‌లు ప్రభావితం అవుతాయని పేర్కొంది. దీంతోపాటు లినిక్స్‌ 122.0.6261.111 కూడా ప్రభావితం అయ్యే జాబితాలో ఉన్నట్లు తెలిపింది. అయితే తన బ్రౌజర్‌లో భద్రతా లోపాలను గూగుల్‌ గుర్తించిందని CERT పేర్కొంది. ఈ భద్రతా లోపాలను సవరిస్తూ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

గూగుల్‌ క్రోమ్ బ్రౌజర్‌ను ఎలా అప్‌డేట్‌ చేయాలి?
స్టెప్‌ 1 : విండోస్‌, మ్యాక్, Linux లోని గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను ఓపెన్‌ చేయాలి.
స్టెప్‌ 2 : బ్రౌజర్ కుడివైపున ఉన్న మూడు చుక్కలపై క్లిక్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్‌లపై క్లిక్‌ చేయాలి.

స్టెప్‌ 3 : అనంతరం కిందకు స్క్రోల్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడ About chrome పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 4 : గూగుల్‌ క్రోమ్‌కు సంబంధించిన కొత్త వెర్షన్‌ అందుబాటులో ఉంటే వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలి.
స్టెప్‌ 5 : గూగుల్‌ క్రోమ్‌ కొత్త వెర్షన్‌ ఇన్‌స్టాల్‌ చేశాక.. కంప్యూటర్‌ను రిస్టార్‌ చేయాల్సి ఉంటుంది.

** ఈనెల ప్రారంభంలోనూ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT) కీలక హెచ్చరికలు జారీ చేసింది. విండోస్‌ 10 మరియు విండోస్‌ 11 వినియోగదారులు వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో కొన్ని లోపాలను గుర్తించామని, వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు ఆయా కంప్యూటర్లపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది.

మైక్రోసాఫ్ట్ విండోస్‌ 32 బిట్‌ మరియు X64 ఆధారిత కంప్యూటర్లలో వీటిని గుర్తించామని పేర్కొంది. హై రిస్క్‌ కేటగిరీగా పరిగణించినట్లు తెలిపింది. సైబర్‌ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ కెర్నెల్‌ కాంపోనెంట్‌లో లోపాలే కారణమని పేర్కొంది. దీని ద్వారా సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లలో లాగిన్‌ అయ్యి, ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం ఉంటుందని అనంతరం కంప్యూటర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటారని హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే అభివృద్ధి చేసిన ప్యాచ్‌లను వెంటనే తమ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Computer emergency response team alerts google chrome users
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X