Home
News

High Risk విండోస్‌ యూజర్లకు సైబర్‌ నిపుణుల హెచ్చరిక.. హై రిస్క్‌ అలెర్ట్‌ జారీ...!

కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ విభాగానికి చెందిన కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-in) కీలక హెచ్చరికలు జారీ చేసింది. విండోస్‌ 10 మరియు విండోస్‌ 11 (Windows 10 and 11 Users) వినియోగదారులు వెంటనే అప్రమత్తం కావాలని సూచించింది. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో కొన్ని లోపాలను గుర్తించామని, వాటి ద్వారా సైబర్ నేరగాళ్లు ఆయా కంప్యూటర్లపై దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది.

మైక్రోసాఫ్ట్ విండోస్‌ 32 బిట్‌ మరియు X64 ఆధారిత కంప్యూటర్లలో వీటిని గుర్తించామని పేర్కొంది. హై రిస్క్‌ కేటగిరీగా గుర్తించినట్లు తెలిపింది. సైబర్‌ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం.. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది.

Computer Emergency response team

మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ కెర్నెల్‌ కాంపోనెంట్‌లో లోపాలే కారణమని పేర్కొంది. దీని ద్వారా సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లలో లాగిన్‌ అయ్యి, ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసే అవకాశం ఉంటుందని అనంతరం కంప్యూటర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటారని హెచ్చరించింది.

కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-in) విండోస్‌ యూజర్లకు కీలక సూచనలు చేసింది. మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే అభివృద్ధి చేసిన ప్యాచ్‌లను వెంటనే తమ కంప్యూటర్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని స్పష్టం చేసింది. యూజర్ల వెంటలే అప్రమత్తం కావాలని సైబర్‌ క్రైం వాచ్‌డాగ్‌ పేర్కొంది.

Computer Emergency response team

** గత నెలలలో గూగుల్ క్రోమ్‌ యూజర్లకు సైబర్‌ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం హెచ్చరించింది. వెంటనే క్రోమ్‌ బ్రౌజర్లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. లేకుంటే కంప్యూటర్‌లోని సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది.

‌క్రోమ్‌ యూజర్లు వెంటనే 114.0.5735.350 లేదా తర్వాత వెర్షన్‌లకు అప్‌డేట్‌ కావాలని సూచించింది. వీటి కంటే పాత వెర్షన్‌లు హ్యాక్‌ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరియు ముఖ్యంగా తెలియని వెబ్‌ సైట్లు ఓపెన్‌ చేసినప్పుుడు వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

** ఆండ్రాయిడ్‌ ఫోన్ల భద్రత కోసం గూగుల్‌ కొత్త సెక్యురిటీ ఫీచర్‌ను పరిచయం చేస్తుంది. హానికరమైన లింక్‌ల నుంచి యూజర్లకు ఈ ఫీచర్‌ భద్రత కల్పిస్తుంది. ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ (Android Safe Browing) పేరుతో గూగుల్‌ ఈ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ ఫీచర్‌ థర్డ్‌ పార్టీ యాప్‌లను కూడా సపోర్టు చేస్తుంది.

యూజర్లు ఏవైనా హానికరమైన లింక్లు క్లిక్‌ చేసినా, వెబ్‌సైట్లలోకి వెళ్లినా ఈ ఫీచర్‌ వెంటనే అలెర్ట్‌ చేస్తుంది. ఈ ఫీచర్‌ ఇప్పటికే గూగుల్‌ పిక్సల్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఫోన్లలో గుర్తించినట్లు ఆండ్రాయిడ్ నిపుణుడు మిషల్‌ రహమన్‌ తెలిపారు. ఈ ఫీచర్‌ ఇతర ఫోన్లకు గూగుల్‌ ప్లేస్టోర్ ద్వారా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. మిషల్‌ రహమన్‌ X పోస్టు ఆధారంగా కొన్ని స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ పేజీ కనిపిస్తోందన్నారు.

]ఈ ఆండ్రాయిడ్‌ సేఫ్‌ బ్రౌజింగ్ ఫీచర్‌ హానికర లింక్‌ల నుంచి యూజర్లను కాపాడుతుందని పేర్కొన్నారు. అయితే ఈ ఫీచర్‌లో ఏయే థర్డ్‌ పార్టీ యాప్‌లు సపోర్టు చేస్తాయన్నది తెలియాల్సి ఉంది. రహమాన్ ట్విట్‌లోని ఎటువంటి పేర్లను వెల్లడించలేదు. అయితే ఈ ఫీచర్‌ సేఫ్టీనెట్‌ సేఫ్‌ బ్రౌజింగ్‌ API అనే లైబ్రరీని ఉపయోగిస్తుందని తెలిపారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Computer Emergency response team alerts windows users to update patches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X