అలాంటి ప్రాంతాల్లో మీ స్మార్ట్‌ఫోన్లను ఛార్జింగ్ చేస్తున్నారా.. బ్యాంకు వివరాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది..!
కేంద్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Indian computer emergency response team- Cert-In) స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ వినియోగదారులకు కీలక హెచ్చరిక చేసింది. సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నారని వెల్లడించింది. USB ఛార్జింగ్ పోర్టులను టార్గెట్ చేస్తున్నారని తెలిపింది.
ఇలాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ చేస్తుంటారా??
ప్రయాణాలు సహా ఇతర సమయాల్లో బస్టాండ్‌లు, హోటళ్లు, స్టేషన్, ఎయిర్‌పోర్టులు ఇలా చాలా ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లను ఛార్జింగ్ చేస్తుంటాం. అయితే ఈ ప్రాంతాల్లోని USB ఛార్జింగ్ స్టేషన్లను సైబర్ దాడులు చేసేందుకు మోసగాళ్లు ఉపయోగిస్తున్నారని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హెచ్చరించింది.

మాల్‌వేర్ పంపే అవకాశం ఉంది..!
ఇలాంటి ప్రాంతాల్లో ఛార్జింగ్ చేసేవారి ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లోకి మాల్‌వేర్‌ను పంపేందుకు USB ఛార్జింగ్ పోర్టులను వినియోగిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. ఫలితంగా పాస్‌వర్డ్, బ్యాంకు వివరాలు సహా ఇతర వ్యక్తిగత డేటా ను కాజేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ దాడులను జ్యూస్ జాకింగ్ (Juice Jacking) అంటారని తెలిపింది.
సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా..
ప్రమాదకర మాల్‌వేర్‌ను పరికరాల్లోకి పంపి ఆయా డివైజ్‌లను తమ నియంత్రణలోకి తీసుకొనే అవకాశం ఉందని హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే ఈ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ తరహా దాడులపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎక్కడపడితే అక్కడ ఛార్జింగ్ పెట్టే అలవాట్లకు స్వస్తి చెప్పాలని స్పష్టం చేసింది. లేకుంటే సైబర్ దాడుల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించింది. బస్టాండ్‌లు సహా ఇతర ప్రాంతాల్లో ఛార్జింగ్ పెట్టాలని భావిస్తే ఎలక్ట్రికల్ వాల్ అవుట్‌లెట్‌ను మాత్రమే వినియోగించాలని USB ఛార్జింగ్ పోర్టులకు దూరంగా ఉండాలని సూచించింది. లేకుంటే పవర్ బ్యాంకులు సహా ఇతర ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుందని పేర్కొంది.
పూర్తిగా ఛార్జింగ్ లేకుంటే..!
అయితే స్మార్ట్‌ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యే పరిస్థితుల్లో మాత్రమే USB ఛార్జింగ్ పోర్టులను ఉపయోగించాలని లేకుంటే, బహిరంగ ప్రాంతాల్లోని USB ఛార్జింగ్ పోర్ట్‌లకు దూరంగా ఉండాలని సూచించింది. USB డేటా బ్లాకర్‌లను ఉపయోగించాలని సూచించింది. దీంతోపాటు ఎప్పటికప్పుడు స్మార్ట్ వేర్ అప్‌డేట్ చేస్తూ ఉండాలి.
ఎప్పుడైనా సైబర్ దాడులకు గురైతే వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం అందించాలి. www.cybercrime.gov.in వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలను గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సూచించింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








