ప్రేమికుల రోజున... కండోమ్ సమాచారం

Posted By: Super

ప్రేమికుల రోజున... కండోమ్ సమాచారం

 

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకోని.. న్యూయార్క్ కండోమ్ కొత్త అప్లికేషన్‌ని రూపొందించింది. ఈ అప్లికేషన్ సహాయంతో వినియోగదారులకువాటి చుట్టుప్రక్కల ప్రదేశాల్లో ఉచిత కండోమ్స్ ఎక్కడ లభిస్తాయో ఇట్టే తెలుపుతుంది. ఈ అప్లికేషన్ ఎవరైతే వినియోగదారులు స్మార్ట్ ఫోన్స్‌ని ఉపయోగిస్తున్నారో వారు ఉపయోగించ వచ్చని న్యూయార్క్ కండోమ్ సంస్ద తెలిపింది.

స్మార్ట్ ఫోన్స్‌లో ఉన్న జిపిఎస్ సిస్టమ్ ద్వారా మీ చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉన్న కండోమ్ డీలర్స్, కండోమ్ రీటైలర్స్‌కు సంబంధించిన సమచారం ఈజీగా కనిపెట్టవచ్చు. మీకు గనుక కండోమ్ డీలర్ పేరు తెలిస్తే ఆటోమ్యాటిక్‌గా పేరుని సెర్చింగ్ ద్వారా ఆ షాపు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.  దీనితో పాటు న్యూయార్క్ కండోమ్ ఫైండర్ కండోమ్ వెండార్ ఎంత దూరంలో ఉందో ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది.

ఈ అప్లికేషన్‌ని రూపొందించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం వాలంటైన్స్ డే సందర్బంగా ప్రేమికులను ఉత్తమమైన సెక్స్‌కి ప్రోత్సహించడానికేనని తెలిపారు. అప్లికేషన్ మార్కెట్ నుండి న్యూయార్క్ కండోమ్ ఫైండర్‌ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విండోస్ స్మార్ట్ ఫోన్స్, బ్లాక్ బెర్రీ స్మార్ట్ ఫోన్స్ అన్నింటిని కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకించి న్యూయార్క్‌లో ఇలాంటి కండోమ్‌కి సంబంధించిన అప్లికేషన్‌ని రూపొందిచండంపై ప్రేమికులు హార్షం వ్యక్తం చేశారు. ఈ అప్లికేషన్‌పై యువకులు ఎలాంటి ఉత్సాహాన్ని చూపిస్తున్నారో వయసు పైపడిన వారు కూడా అదే విధమైన ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot