టెక్నాలజీ ఎంతగానో అభివృధ్ది చెందింది.. టీవీలో ఇంటర్నెట్

Posted By: Staff

టెక్నాలజీ ఎంతగానో అభివృధ్ది చెందింది.. టీవీలో ఇంటర్నెట్

కంప్యూటర్‌, మొబైళ్లతో నెట్‌ను యాక్సెస్‌ చేయడం మమూలే. అత్యాధునిక ఐపీ టీవీలు కూడా మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. వీటన్నింటినీ కాదని ఇంట్లో ఉన్న సాధారణ ఎల్‌సీడీ టీవీలో ఇంటర్నెట్‌ను యాక్సెస్‌ చేస్తే? వొడాఫోన్‌ 'వెబ్‌బాక్స్‌'తో ఇది సాధ్యమే. కిబోర్డ్‌లా కనిపిస్తున్న వెబ్‌బాక్స్‌తో టీవీలో నెట్‌ బ్రౌజింగ్‌ చేయవచ్చు. నాజూకుగా ఉండే ఈ కీబోర్డ్‌లో వొడాఫోన్‌ సిమ్‌కార్డ్‌ను ఇన్‌సర్ట్‌ చేసేలా ప్రత్యేక స్లాట్‌, బిల్ట్‌ఇన్‌ మోడెమ్‌ను ఏర్పాటు చేశారు.

సిమ్‌కార్డ్‌ని కీబోర్డ్‌లో పెట్టి ఎరుపు, పసుపు, తెలుపు పిన్నులతో కీబోర్డ్‌ని టీవీకి కనెక్ట్‌ చేయాలి. దీంతో టీవీ తెరపై వెబ్‌ విహారం చిటికెలో సాధ్యం అవుతుంది. ఒపేరా మినీ బ్రౌజర్‌ను దీంట్లో ఇన్‌స్టాల్‌ చేశారు. ఇక యూట్యూబ్‌, ఫొటో షేరింగ్‌ సైట్లు, మెయిల్‌ చెకింగ్‌, ఛాటింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌, ఆన్‌లైన్‌ వీడియోగేమ్స్‌... అన్నీ సాధ్యమే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot