డేటా వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకుంటే దిమ్మతిరగాల్సిందే
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం సంస్థలు దిగివచ్చిన సంగతి తెలిసిందే.
భారత్‌లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జియో రాకతో డేటా వినియోగం విషయంలో ఇతర టెలికాం సంస్థలు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కాగా, 2018లో భారత్‌లో ఇంటర్నెట్ కనెక్షన్లు 65శాతం పెరిగాయని ట్రాయ్ గణాంకాల ద్వారా వెల్లడైంది. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ ఏడాది డేటా వినియోగం డబుల్ అయ్యే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ సారి డేటా వినియోగం ఎందుకు పెరుగుతుందనే దానిపై పలు అంశాలు వారు లేవనెత్తుతున్నారు.

సార్వత్రిక ఎన్నికలు
మరో అయిదారు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సారి డేటా వినియోగం భారీగా పెరగనుంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు వాట్సప్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి వాటి వినియోగం భారీగా పెరగనుంది.

గేమ్స్
ఎన్నికలతో పాటు క్రికెట్ లో కూడా డేటా వినియోగం భారీగా పెరగనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అలాగే ప్రపంచ కప్ కూడా ఫస్ట్ ఆఫ్ ఇయర్ లో ఉండటం వల్ల అందరూ డేటాను తెగ వినియోగిస్తారని అంచనాలు వెలువడుతున్నాయి.

50కోట్ల మార్కు
ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారి సంఖ్య 50కోట్ల మార్కును దాటింది. సెప్టెంబరు 2018 చివరి నాటికి భారత్‌లో నారో బ్యాండ్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 56కోట్లకు చేరాయని ట్రాయ్ పేర్కొంది. ఇందులో 54కోట్ల మంది మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. మిగిలిన వాళ్లు బ్రాడ్ బ్యాండ్ వాడుతున్నారు.

మొబైల్‌ఫోన్లు, డాంగిల్స్ ద్వారా అంతర్జాల సేవలు
ఇక మొత్తం 56కోట్ల కనెక్షన్లలో 36కోట్ల మంది పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 19.4కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల వారని ట్రాయ్ వెల్లడించింది. కాగా, ఆగస్టు 31, 2018 నాటికి 445.18మిలియన్ల మంది మొబైల్‌ఫోన్లు, డాంగిల్స్ ద్వారా అంతర్జాల సేవలు పొందుతున్నారు.

ఐదు టెలికాం సంస్థలు ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి....
మొత్తం ఐదు టెలికాం సంస్థలు ప్రధాన వాటాదారులుగా ఉన్నాయి. అత్యధికంగా జియో ఇన్ఫోకామ్(252.25మిలియన్లు), ఉండగా, ఆ తర్వాత భారతీ ఎయిర్‌టెల్(99.29మిలియన్లు), వొడాఫోన్ (51.82మిలియన్లు), ఐడియా సెల్యులార్(47.90మిలియన్లు), బీఎస్‌ఎన్‌ఎల్(20.12మిలియన్లు) ఉన్నాయి.

అత్యధికం ఇక్కడే
మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో అత్యధికంగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో 20కోట్లమంది ఉంది ఉన్నారు.వచ్చే రెండు, మూడేళ్లలో ఇంటర్నెట్ వినియోగంలో చైనాతో సమానం అవుతామని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications








