అబ్బా.. ఏం టెక్నాలజీ గురూ!

Posted By: Prashanth

అబ్బా.. ఏం టెక్నాలజీ గురూ!

 

మొబైల్‌కు వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లు ఫోన్ స్క్రీన్ మీద కాకుండా, కళ్లకు పెట్టుకునే కాంటాక్ట్ లెన్సుల మీద డిస్‌ప్లే అయ్యే సదుపాయంతో సరికొత్త టెక్నాలజీని అభివృద్ధి పరిచారు బెల్జియన్ శాస్త్రవేత్తలు. ఈ లెన్స్‌లను పెట్టుకుంటే, టెక్ట్స్ మెసేజ్‌లు చదువుకోవడానికి అనువైన రీతిలో కళ్ల ముందు డిస్‌ప్లే అవుతాయి. దీంతో మెసేజ్ అలర్ట్ వచ్చిన ప్రతిసారీ మొబైల్ తీసి చూసుకోవాల్సిన అవసరం తీరిపోతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పుటాకారంలో వంగినట్టుగా ఉండే ఎల్‌సీడీ డిస్‌ప్లేలను కాంటాక్ట్ లెన్సులలో ఒదిగేలా, వైర్‌లెస్ టెక్నాలజీతో శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు.

‘రైల్ రాడార్ అప్లికేషన్’

మీరు ఎక్కాల్సిన ట్రెయిన్ ఎక్కడుందో.. ఎంత దూరంలో ఉందో ఖచ్చితమైన వివరాలతో ఇక పై తెలుసుకోవచ్చు. రైల్వే శాఖ ఇటీవల ‘రైల్ రాడార్’ పేరుతో సరికొత్త ఆన్‌లైన్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. ఈ అప్లికేషన్ ఉపయోగించుకుని గూగుల్ మ్యాప్ సాయంతో దేశవ్యాప్తంగా ఉన్న 6,500 రైళ్లకు సంబంధించి ఖచ్చితమైన భౌగోళిక స్థానాన్ని తెలసుకోవచ్చు. రైల్వే శాఖ దేశవ్యాప్తంగా రోజుకు 10,000 రైళ్లను నడుపుతోంది. అయితే ఈ రైల్ రాడర్ అప్లికేషన్ 6,500 రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలదని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఈ అప్లికేషన్‌ను ఓపెన్ చేయగానే ప్రత్యక్షమయ్యే మ్యాప్ ద్వారా అవసరమైన రైళ్ల సమచారాన్ని తెలుసుకోవచ్చు. రైల్ రాడార్ అప్లికేషన్ లింక్ అడ్రస్

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting