కంటిచూపుతో కంప్యూటర్ ఆపరేటింగ్!

Posted By: Prashanth

కంటిచూపుతో కంప్యూటర్ ఆపరేటింగ్!

 

శరీర అవయవాలు కదిలించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న వారు కంప్యూటర్‌ను సులువుగా ఆపరేట్ చేసేలా జీటీ3డి డివైజ్ రూపుదిద్దుకుంది. 3డీ ఐ ట్రాకింగ్ కెమెరాలు కలిగి ఉన్న ఈ పరికరాన్ని ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. ఈ డివైజ్‌ను కళ్లకు దగ్గరగా అమర్చుకుని మౌస్ సహాయం లేకుండా కంప్యూటర్‌ను కేవలం కంటిచూపుతో నియంత్రివచ్చు. అంతేకాదండోయ్! ఎలక్ట్రానిక్ వీల్ చైర్‌ను సైతం కనుసైగతో శాసించవచ్చు. శరీరం సహకరించక నిస్సహాయ స్థితిలో ఉన్నవారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ వినూత్న పరికరం ధర రూ.3440.

ఫేస్‌బుక్ కొత్త సేవలు ప్రారంభం!

న్యూయార్క్: ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ భారత్‌తో సహా ఆరు దేశాల్లో ‘యాప్ సెంటర్’ను ప్రారంభించింది. అమెరికాలో ఈ యాప్ సెంటర్ సేవలను గడచిన జూన్‌లోనే ఫేస్‌బుక్ ప్రారంభించింది. ఆటలు, మ్యూజిక్, మీడియా తదితర అంశాలకు సంబంధించిన కంటెంట్‌ను ఫేస్‌బుక్ యూజర్లు ‘యాప్ సెంటర్’ ద్వారా సులువుగా పొందవచ్చు. ఫేస్‌బుక్ డాట్‌కామ్ హోమ్ పేజీలో ఎడుమ వైపున యాప్ సెంటర్ ఐకాన్‌ను ఏర్పాటు చేశారు. ఆపిల్ ఇంకా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్‌లను యాప్ స్టోర్ సపోర్ట్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot