స్మార్ట్‌ఫోన్‌లు... సరికొత్త ఫీచర్లు

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. స్మార్ట్ ఫీచర్లతో రూపుదిద్దుకుంటున్న నేటితరం హ్యాండ్‌సెట్‌లు పలు ప్రత్యేకమైన అప్లికేషన్‌లను కలిగి రోజువారి అవసరాలను తీర్చటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈమెయిల్, ఆన్‌లైన్ బ్యాకింగ్, గేమింగ్, చాటింగ్, వీడియో వీక్షణ ఇలా ఎన్నోరకాలు అవసరాలను స్మార్ట్‌ఫోన్ తీరుస్తుంది.

ఆధుని
క జనజీవనం పూర్తిస్థాయిలో స్మార్ట్ టెక్నాలజీ పై ఆధారపడుతున్న నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ప్రత్యేక ఫీచర్ల రూపకల్పన పై దృష్టిసారించి ఆ దిశగా సఫలీకృతమవుతున్నాయి. గత నెలలో బార్సిలోనా వేదికగా కన్నలపండుగా ముగిసిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సరికొత్త ఆవిష్కరణలను మానవాళికి పరిచయం చేసింది. ఈ ప్రదర్శనలో చోటుచేసుకున్న పలు ప్రత్యేక స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలను మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్‌లు... సరికొత్త ఫీచర్లు

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013లో భాగంగా క్వాల్కమ్ సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ సరికొత్త ఆల్‌జాయ్న్ అప్లికేషన్ యాపిల్ ఇంకా సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లను సపోర్ట్ చేస్తుంది.
ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉన్న ఈ స్మార్ట్‌అప్లికేషన్ మీ బెడ్ కాఫీని సైతం సిద్ధం చేయగలదు.

స్మార్ట్‌ఫోన్‌లు... సరికొత్త ఫీచర్లు

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013లో భాగంగా ఫుజిట్సూ ఇంకా సోనీ కంపెనీలు ‘ఎక్స్ పీరియా జెడ్', ‘ఫుజిట్సూ ఎస్01' మోడళ్లలో రెండు సరికొత్త వాటర్ ప్రూఫ్ స్మార్ట్ ఫోన్ లను ఆవిష్కరించాయి. ఈ స్మార్ట్‌ హ్యాండ్ సెట్ లు నీటిలో సైతం పనిచేస్తాయి.

స్మార్ట్‌ఫోన్‌లు... సరికొత్త ఫీచర్లు

3డీ ప్రింటింగ్ సంస్థ మేకర్ బోట్ నోకియాతో జతకట్టి ఫోన్ కేస్ లను కస్టమైజ్ చేసుకునే సరికొత్త సాంకేతికతను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013లో ప్రదర్శించింది. ఈ ప్రత్యేక సాంకేతికత ద్వారా
ఫోన్ కేస్ లు స్వతహాగా ప్రింట్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు... సరికొత్త ఫీచర్లు

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013లో భాగంగా జపాన్ కు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ బ్రాండ్ ఫుజిట్సు స్టైలిస్టిక్ ఎస్01 పేరుతో సరికొత్త ఫోన్ ను ప్రదర్శించింది. ఈ హ్యాండ్ సెట్ ను ప్రత్యేకించి పెద్ద వయసు వారి కోసం డిజైన్ చేయటం జరిగింది. సలువుగా అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని పెద్ద ఫాంట్ లలో వీక్షించవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లు... సరికొత్త ఫీచర్లు

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2013లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ జడ్‌టీఈ ‘జడ్ టీఈ మెమో' పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన డిజిటల్ డాల్బీ ఆడియో టెక్నాలజీని కలిగి థియోటర్ తరహా సౌండ్ అనుభూతులను చేరువచేస్తుంది. ఫోన్ ధర అంచనా $600.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot