ఆఫ్‌లైన్ మార్కెట్లోకి కూల్‌ప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

By: BOMMU SIVANJANEYULU

బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూ వస్తోన్న కూల్‌ప్యాడ్ ఆఫ్‌లైన్ మార్కెట్‌లోనూ తన పరిధిని విస్తరించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో తన రెండవ ఎక్స్‌పీరియన్స్ జోన్-ప్లస్ సర్వీస్ సెంటర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసింది.

ఆఫ్‌లైన్ మార్కెట్లోకి  కూల్‌ప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌లు

కంపెనీకి సంబంధించిన మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఢిల్లీలో ఉంది. త్వరలోనే మరిన్ని ప్రాంతాల్లో ఈ తరహా ఎక్స్‌పీరియన్స్ జోన్‌లను ఏర్పాటు చేయునున్నట్లు కూల్‌ప్యాడ్ తెలిపింది. కూల్‌ప్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ల వద్ద ఆ కంపెనీ ప్రొడక్ట్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే వీలుంటంది.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో కూల్‌ప్యాడ్ మంచి సెంటిమెంట్‌తో దూసుకువెళుతోందని, ఇది తమ ఎదుగుదలకు శుభపరిణామమని కూల్‌ప్యాడ్ ఇండియా సీఈఓ సయ్యద్ తాజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న నెలల్లో మరిన్ని కూల్‌ప్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌లను దేశవ్యాప్తంగా నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు.

దిమ్మతిరిగేలా కొత్త టెక్నాలజీ , మీ చెమటే మీ పాస్‌వర్డ్ !

కూల్‌ప్యాడ్ బ్రాండ్‌కు సర్వీస్ పార్టనర్‌గా ''మార్స్ ఇ-సర్వీసెస్’’ వ్యవహరిస్తుంది. కూల్‌ప్యాడ్ ఫోన్‌లకు సంబంధించి సర్వీసింగ్ అలానే వారంటీ వ్యవహారాలను ఈ సంస్థ చూసుకుటుంది. ఈ ఏడాది చివరినాటికి ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రముఖ నగరాల్లో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను మార్స్ ఇ-సర్వీసెస్ ఓపెన్ చేయబోతోంది.

ఇప్పటికే షావోమి, విప్పో, వివో వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు విజయవంతంగా ఆఫ్‌లైన్ సెగ్మెంట్‌లో రాణించగలుగుతున్నాయి. షావోమికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ జోన్‌ల ఎంఐ హోమ్ పేరుతో ఇప్పటికే ఏర్పాటు కాగా విప్పో, వివోలకు సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు త్వరలోనే ఎక్స్‌క్లూజివ్‌గా లాంచ్ కాబోతున్నాయి.

Read more about:
English summary
After Delhi, Coolpad has opened its second service center in Hyderabad in the country.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot