గొరిల్లా గ్లాస్ 4 వచ్చేసింది!

మార్కెట్లో లభ్యమవుతోన్న వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లు అధునాతన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్ర్కీన్‌లను కలిగి ఉంటున్నాయి. ఈ గ్లాస్‌ను కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌లు క్రింద పడినప్పటికి స్ర్కీన్ ఏ మాత్రం దెబ్బతినదు. స్ర్ర్కాచ్‌లను సైతం ఈ గ్లాస్ నిరోధిస్తుంది. ప్రస్తుతం మీరు వాడుతోన్న స్మార్ట్‌ఫోన్‌కు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ లేనట్లయితే, తరువాత ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ కచ్చితంగా గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉండేలా చూసుకోండి.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
అమెరికాకు చెందిన కార్నింగ్ ఇంక్ కంపెనీ ఇటీవల యూఎస్ మార్కెట్లో తన లేటెస్ట్ వర్షన్ గొరిల్లా గ్లాస్ 4ను విడుదల చేసింది. తాజాగా ఈ అధునాతన గ్లాస్‌ను ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. మార్కెట్లో లభ్యమవుతోన్న ఇతర కంపెనీ గ్లాస్‌లతో పోలిస్తే తాజాగా విడుదలైన గొరిల్లా గ్లాస్ 4 రెండు రెట్లు దృఢంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








