ఆపిల్ ఐఫోన్స్ కార్మికుల మీద పడ్డ కరోనావైరస్ ప్రభావం

|

ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ చైనాలోని తన ఫాక్స్కాన్ (Foxconn's) ప్లాంట్లో ఐఫోన్లను తయారుచేసే కార్మికులను రెండు వారాల వరకు నిర్బంధించనున్నట్లు కంపెనీ తెలిపింది. చైనా యొక్క ప్రధాన నగరాలలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా తమ కార్మికుల రక్షణను కోసం ఇటువంటి కఠినతరమైన నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఆపిల్ ఫాక్స్కాన్ ప్లాంట్
 

ఆపిల్ ఫాక్స్కాన్ ప్లాంట్

ఫాక్స్కాన్ ప్లాంట్ అనేది ప్రపంచంలోనే ఆపిల్ యొక్క అతిపెద్ద ప్లాంట్. దీనిని అధికారికంగా హోన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారు. ఇందులో ఆపిల్ యొక్క ఐఫోన్లకు మరియు ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల కోసం గాడ్జెట్ల కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ వస్తువులను సమీకరిస్తుంది. ఫాక్స్కాన్ ప్లాంట్ చైనా యొక్క ప్రైవేట్-రంగంలో అతిపెద్దది. వూహాన్‌లో దీనికి అనుసంధానంగా 30 కర్మాగారాలు మరియు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. వీటి అన్నిటిలో సుమారు ఒక మిలియన్ మందికి పైగా పనిచేస్తున్నారు.

Xiaomi Redmi 9A:పవర్ ఫుల్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ తో షియోమీ కొత్త ఫోన్

జెంగ్‌జౌ ప్లాంట్‌

ఫాక్స్కాన్ యొక్క విస్తారమైన కర్మాగారాల నెట్‌వర్క్ చైనాలోని సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని జెంగ్‌జౌలో అతిపెద్దది. వీటిని కార్మికులు "ఐఫోన్ సిటీ" గా పిలుస్తారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పనులను నిలిపివేసిన సంస్థ నూతన సంవత్సర తరువాత ఫిబ్రవరి 10 న తిరిగి తన కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. కానీ స్థానిక ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జెంగ్‌జౌ ప్లాంట్‌లోని ఇన్‌స్టేట్, అవుట్-స్టేట్ ఉద్యోగులను వరుసగా ఏడు మరియు 14 రోజులు నిర్బంధించాలని సూచించినట్లు కంపెనీ తెలిపింది.

Realme C3: రూ.6,999 కే 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌

కరోనా వైరస్ ప్రభావం

కరోనా వైరస్ ప్రభావం

కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చైనా యొక్క పారిశ్రామిక స్థావరం బఫే చేయబడింది. ఇది మధ్య చైనాలోని వుహాన్ తయారీ కేంద్రంలో ప్రారంభమైంది. కాని అప్పటి నుండి దీని యొక్క ప్రభావం 20 కి పైగా దేశాలకు వ్యాపించింది. ధృవీకరించబడిన సమాచారం ప్రకారం చైనాలో అంటువ్యాధుల సంఖ్య 28,000 కు పైగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో పుంజుకున్న మరణాల సంఖ్య 560 దాటింది. తైవాన్ ఇప్పటివరకు 11 ధృవీకరించబడిన కేసులను నివేదించింది. అందులో ఎక్కువ మంది వుహాన్ నుండి తిరిగి వస్తున్న వారిగా గుర్తించారు.

ప్రేమికుల రోజు బహుమతిగా తక్కువ ధరలో గల స్మార్ట్ ఐటమ్స్ ఇవే!!!!

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
 

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా యొక్క లించ్‌పిన్ పాత్ర ఇచ్చిన అంతర్జాతీయ సరఫరా మరియు తయారీపై కూడా ఈ వైరస్ ప్రభావం చూపుతుంది. ఫాక్స్కాన్ ఇప్పుడు ఈ సంవత్సరం ఒకటి నుండి మూడు శాతం అమ్మకాల పెరుగుదలను అంచనా వేసింది. జనవరిలో మూడు నుండి ఐదు శాతం వరకు అంచనా వేసినట్లు ఛైర్మన్ యంగ్ లియు బ్లూమ్బెర్గ్ న్యూస్ కు చెప్పారు.

BSNL Bharat Fibre: 2000GB డేటా ప్రయోజనంతో కొత్త ప్లాన్

ఫాక్స్కాన్

ఫాక్స్కాన్ ఉత్పత్తి కొరత యొక్క భయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. 2003 లో SARS మహమ్మారి తరువాత ఫాక్స్కాన్ లో కొరత సంభవించడం ఇదే మొదటి సారి. ఈ కరోనా వైరస్ వ్యాప్తి మునుపటి అనుభవంను తలపిస్తోంది అని మీడియాకు చెప్పారు.

Airtel Digital TV చందాదారుల చేరిక పెరిగింది!!! కానీ.....

విదేశీయులందరూ

గత 14 రోజులలో చైనా, హాంకాంగ్ లేదా మకావులలో నివసించిన లేదా పర్యటించిన విదేశీయులందరూ ఈ ద్వీపంలోకి ప్రవేశించడాన్ని తాత్కాలికంగా నిరోధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల నుండి తిరిగి వచ్చే తైవాన్‌లో రెసిడెన్సీ అనుమతి ఉన్న విదేశీయులు తప్పనిసరిగా 14 రోజుల స్టే-హోమ్ దిగ్బంధానికి లోనవుతారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Coronavirus Effect Impact on Apple iPhones Workers in China

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X