కరోనావైరస్ దెబ్బతో బిలియన్ల నష్టాలను చవిచూసిన ప్రపంచ కుబేరులు

|

కరోనావైరస్ యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్ మీద కూడా పడింది. భారతదేశంలో సెన్సెక్స్ అయితే ఎప్పుడు లేనంతగా దారుణంగా పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా గల మార్కెట్లలో ఇలాంటి సంఘటనలు చాలా వరకు నివేదించబడ్డాయి. ఈ కోవలో అమెజాన్,రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి అతి పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్
 

రిలయన్స్ ఇండస్ట్రీస్

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధరలో తీవ్ర క్షీణతను అనుభవిస్తున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ ఇప్పుడు కేవలం ఒక రోజులోనే 5.6 బిలియన్ డాలర్లను నష్టపోయారు. భారతదేశం మరియు ప్రపంచంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల కారణంగా సౌదీ అరేబియా రష్యాతో ధరల యుద్ధాన్ని ప్రారంభించడంతో అంబానీ యొక్క షేర్ ధరలు ముందు ఉన్న దానికంటే 31 శాతం క్షిణించి నష్టాలను చవిచూసాయి.

Poco X2 Sale: ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లతో గొప్ప అవకాశం

బిలియనీర్స్

ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితా ప్రకారం 2020 మార్చి 9 నాటికి అంబానీ యొక్క నికర లాభం విలువ 42.2 బిలియన్ డాలర్లుగా ఉంది. గత వారం శుక్రవారం సాయంత్రం 5:00 గంటలకు లేదా శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు కనిపించిన 11.6 శాతం దానికంటే ప్రస్తుతం అతని యొక్క షేర్ల విలువ 5.6 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది.

Coronavirusను అరికట్టడానికి గాడ్జెట్‌లను శుభ్రం చేయడానికి చిట్కాలు

కరోనావైరస్

గత వారం అధికంగా నష్టాలను చవిచూసిన వారి జాబితాలో ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తర్వాత స్థానంలో అంబానీ ఉన్నారు. కరోనావైరస్ భయాల కారణంగా ప్రపంచ మార్కెట్లు పతనమవుతూనే ఉన్నాయని ఫోర్బ్స్ నివేదించింది. ఈ ఘోరమైన వైరస్ వ్యాప్తి కారణంగా ప్రజలు తమ యొక్క ప్రయాణాలను అధికంగా నిలిపివేయడంతో చమురు ధరలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను నడుపుతున్న అంబానీ యొక్క ఆయిల్-టు-టెలికాం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ ధరల మీద దీని యొక్క ప్రభావం తీవ్రస్థాయిలో పడింది.

Jio Rs.4999 Prepaid Plan: అధిక వాలిడిటీ గల ఒకే ఒక ప్లాన్

రిలయన్స్ ఇండస్ట్రీస్
 

సౌదీ అరేబియా మరియు రష్యా మధ్య ధరల యుద్ధం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ ధర గత 12 సంవత్సరాలలో పోలిస్తే అతిపెద్ద పతనాన్ని నమోదు చేసింది. దీనితో పాటుగా కరోనావైరస్ కారణం కూడా సంస్థ యొక్క స్టాక్ మార్కెట్ ను మరింత బలహీనమైనదిగా చేసింది. స్క్రిప్ట్ సోమవారం 12.35 శాతం క్షీణించి రూ.1113.15 వద్ద ముగిసింది. ఇది సోమవారం రూ.1,094.95 కనిష్టానికి చేరుకుంది. రూ.7.40 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచినప్పటికీ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ .7.06 కోట్లకు పడిపోయింది.

eSIM సపోర్టుతో ఒప్పో నుంచి వాచ్

పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్

ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) గత వారం ప్రతిపాదించిన 1.5 మిలియన్ రోజువారీ బారెల్స్ ఉత్పత్తి కోతకు రష్యా మద్దతు ఇవ్వకపోవడంతో సౌదీ అరేబియా చమురు కోసం అధికారిక అమ్మకపు ధరలను తగ్గించింది మరియు వచ్చే నెల నుండి ముడి చమురు ఉత్పత్తిని పెంచే ప్రణాళికలను ప్రకటించింది. కరోనావైరస్ అంటువ్యాధి కారణంగా చమురు డిమాండ్ పెద్ద దెబ్బతిన్న సమయంలో ధర తగ్గింపు వస్తుంది.

Apple iPad Airను ఉచితంగా రిపేర్ చేసుకోవడానికి మంచి సమయం ఇదే

అమెజాన్ CEO జెఫ్ బెజోస్

అమెజాన్ CEO జెఫ్ బెజోస్

కరోనావైరస్ ప్రభావం కారణంగా అమెజాన్ యొక్క స్టాక్ ధర పడిపోవడంతో ప్రపంచంలోని ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న అమెజాన్ CEO జెఫ్ బెజోస్ కేవలం ఒకే ఒక రోజులో దాదాపుగా 7 బిలియన్ డాలర్లను నష్టపోయినట్లు ఒక నివేదిక పేర్కొంది. బెజోస్ యొక్క ముందురోజు సంపద 117 బిలియన్ డాలర్లు ఉండగా తరువాతి రోజు ఇది 110 బిలియన్ డాలర్లకు పడిపోయిందని నివేదిక పేర్కొంది. అంతే కాదు గత నెలలోనే బెజోస్ 18 మిలియన్లను కోల్పోయినట్లు ముందే నివేదించారు.

చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?

పెద్ద టెక్ కంపెనీలు

పెద్ద టెక్ కంపెనీలు

కరోనావైరస్ ప్రభావం షేర్ మార్కెట్‌పై తీవ్రంగా ఉందని అన్ని నివేదికలు సూచిస్తున్నాయి. యుఎస్‌ నగరంలో నాలుగు పెద్ద టెక్ కంపెనీలు అయిన ఆపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి సంస్థలు కేవలం ఒక రోజులోనే దాదాపుగా 321 బిలియన్ డాలర్ల షేర్ మార్కెట్‌ను కోల్పోయాయి. టెస్లా సంస్థ యొక్క CEO ఎలోన్ మస్క్ కూడా ఇదే రోజు దాదాపుగా 4 బిలియన్ డాలర్ల నష్టంను చవిచూసినట్లు సిఎన్‌బిసి నివేదిక పేర్కొంది .

టెస్లా CEO ఎలోన్ మస్క్

టెస్లా CEO ఎలోన్ మస్క్

టెక్ పరిశ్రమపై కరోనావైరస్ యొక్క ప్రభావం భారీగా ఉన్నదని టెస్లా సంస్థ యొక్క CEO ఎలోన్ మస్క్ ట్వీట్ ద్వారా తెలిపాడు. ఈ వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి టెక్ సంస్థలు తమ యొక్క ఈవెంట్లను ఇప్పటికే రద్దు చేసుకున్నాయి. డేని యొక్క ప్రభావం ఉత్పత్తుల సరఫరా మీద కూడా ప్రభావితం చూపుతోందని నివేదించింది. కంపెనీ యొక్క ఆదాయం మీద దీని ప్రభావం పడుతోందని ఆపిల్ మరియు మైక్రోసాఫ్ట్ సంస్థలు కూడా ఇలాంటి హెచ్చరికను జారీచేశాయి.

వైరస్

అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించినప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి యొక్క ప్రభావాన్ని అనుభవిస్తోందని స్పష్టమవుతోంది. యుఎస్‌లోని ప్రతి పెద్ద కంపెనీలు దాదాపుగా తమ ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలనీ ఆదేశాలను ఇచ్చింది. శాన్ఫ్రాన్సిస్కో మరియు న్యూయార్క్ కార్యాలయాల్లోని గూగుల్ సంస్థ ఉద్యోగులు కూడా ప్రస్తుతం ఇంటి వద్ద నుండే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని గూగుల్ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
coronavirus Effect : World's Richest Mans Loss Billions of Amount in One Day

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X