Coronavirusను అరికట్టడానికి గాడ్జెట్‌లను శుభ్రం చేయడానికి చిట్కాలు

|

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ ప్రస్తుతం అతి పెద్ద మహమ్మారిగా మారింది. కరోనావైరస్ యొక్క వ్యాప్తి (COVID-19) అధికంగా వ్యాపిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావానికి గురైన వారి సంఖ్య ఇప్పుడు 114,430 కి చేరింది. ఇండియాలో కూడా కరోనావైరస్ కు గురైన వారి సంఖ్య 46కు చేరింది.

కరోనావైరస్

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రాథమిక పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. ప్రాథమిక పరిశుభ్రత అవగాహనలో భాగంగా చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం, చేతి తొడుగులు, ముసుగులు వంటి వాడమని ప్రజలను కోరుతున్నారు.

 

 

Jio Rs.4999 Prepaid Plan: అధిక వాలిడిటీ గల ఒకే ఒక ప్లాన్Jio Rs.4999 Prepaid Plan: అధిక వాలిడిటీ గల ఒకే ఒక ప్లాన్

ప్రాథమిక పరిశుభ్రత

ప్రాథమిక పరిశుభ్రత

ప్రాథమిక పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనావైరస్ వంటి ఇతర రోగాలను మన దరిచేరకుండా చేయవచ్చు. ప్రజలు తమ రోజు వారి జీవితంలో అధికంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఇతర స్మార్ట్ ఉపకరణాలను అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. స్మార్ట్‌ఫోన్‌ మరియు
ల్యాప్‌టాప్ స్క్రీన్‌లలో బ్యాక్టీరియాలు అధికంగా వృద్ధి చెందుతాయి. అంటువ్యాధులు సూక్ష్మక్రిముల ద్వారా వ్యాపిస్తాయి అని అందరికి తెలుసు కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో పరిశుభ్రమైన పద్ధతులను మరింత అనుసరించడం చాలా ముఖ్యం.

 

WhatsAppలో చక్కర్లు కొడుతున్న కరోనావైరస్ చిట్కాలు!!! అస్సలు నమ్మకండి...WhatsAppలో చక్కర్లు కొడుతున్న కరోనావైరస్ చిట్కాలు!!! అస్సలు నమ్మకండి...

మీ పరికరాలను తరచూ శుభ్రపరచడం

మీ పరికరాలను తరచూ శుభ్రపరచడం

మీరు వినియోగిస్తున్న గాడ్జెట్‌లలో రోజులో అధికంగా వినియోగిస్తున్న స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌లను ప్రతి రోజు శుభ్రపరచడం చాలా ముఖ్యం . అలా చేయడానికి మీరు మీ పరికరాలను శుభ్రం చేయడానికి కనీసం 60% ఆల్కహాల్ లేదా శానిటైజర్‌ను ఉపయోగించాలి. అయినప్పటికీ మీరు పరిశుభ్రపరచబోయే పరికరం నీటి నిరోధకత కోసం IP ధృవీకరించబడిందని నిర్ధారించుకోండి. అది కాకపోతే శుభ్రమైన బట్టను ఉపయోగించి శుభ్రం చేయవచ్చు.

 

 

Apple iPad Airను ఉచితంగా రిపేర్ చేసుకోవడానికి మంచి సమయం ఇదేApple iPad Airను ఉచితంగా రిపేర్ చేసుకోవడానికి మంచి సమయం ఇదే

ఇయర్ ఫోన్స్ ఉపయోగించి కాల్స్ తీసుకోండి

ఇయర్ ఫోన్స్ ఉపయోగించి కాల్స్ తీసుకోండి

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న వారు నేరుగా ఫోన్ కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి బదులుగా ఒక జత ఇయర్‌ఫోన్‌లను లేదా హెడ్‌ఫోన్‌లను ఉపయోగించడం చాలా వరకు మంచిది. ఎందుకంటే డిస్ప్లేను మీ ముఖం నుండి దూరంగా ఉంచడానికి వీలుగా ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ లను శుభ్రం చేయడం మాత్రం మరచిపోకండి. దీనిని శుభ్రపరచడానికి కూడా హ్యాండ్ శానిటైజర్‌ను ఉపయోగించవచ్చు.

 

 

BSNL అడ్వాన్స్ రెంటల్ ఆఫర్: ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా BSNL ఆఫర్స్BSNL అడ్వాన్స్ రెంటల్ ఆఫర్: ప్రైవేట్ ఆపరేటర్లకు దీటుగా BSNL ఆఫర్స్

వాయిస్ ఆదేశాలు వినియోగించడం

వాయిస్ ఆదేశాలు వినియోగించడం

స్మార్ట్‌ఫోన్‌లను అధికంగా వినియోగించేవారు వివిధ కార్యకలాపాలను నిర్వహించడానికి ఫోన్‌ను తాకడానికి బదులుగా అందులో గల స్మార్ట్ ఫీచర్లను వినియోగించడం చాలా వరకు మంచిది. ఈ ఫీచర్లలో భాగంగా వాయిస్ ఆదేశాలపై ఆధారపడి మీకు కావలసినదాన్ని హ్యాండ్స్-ఫ్రీ పద్ధతిలో అమలు చేయవచ్చు. గూగుల్ అసిస్టెంట్ మరియు సిరి వంటి వాయిస్ అసిస్టెంట్ల ద్వారా మీకు కావలసినదానిని సెర్చ్ చేయవచ్చు. ఇది అంటు వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.

 

ఆపిల్ నుంచి త్వరలో కొత్త ఉత్పత్తులుఆపిల్ నుంచి త్వరలో కొత్త ఉత్పత్తులు

గాడ్జెట్‌లను మరొకరితో షేర్ చేయకపోవడం

గాడ్జెట్‌లను మరొకరితో షేర్ చేయకపోవడం

ఇతరుల స్మార్ట్‌ఫోన్‌లు మరియు ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం మరియు మీ గాడ్జెట్‌లను ఇతరులకు ఇవ్వడం రెండు కూడా ప్రస్తుత సమయంలో ప్రమాదం ఉన్నందున వీలైనంత వరకు గాడ్జెట్‌లను ఇతరులతో పంచుకోవడం అందరికి మంచిది. ఒకవేళ అత్యవసర సమయాలలో మీరు గాడ్జెట్‌లను మరొకరితో పంచుకోవలసి వస్తే కనుక మీరు ఉపయోగించడానికి ముందు వాటిని శుభ్రం చేశారని నిర్ధారించుకోండి అలాగే మీ యొక్క చేతులు శుభ్రంగా ఉన్నాయా లేవా అని కూడా నిర్దారించుకోండి.

Best Mobiles in India

English summary
Coronavirus Safety Tips in Telugu: Follow These Tips To Clean Your Smartphones, Laptops

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X